Skip to main content

మనం సైతం సేవా సమరం…

manam saitham press meetవరుస సేవా కార్యక్రమాలతో పేదల పక్షాన సేవా సమరం చేస్తోంది మనం సైతం. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా సంస్థ క్రమం తప్పకుండా అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. వివిధ సమస్యల్లో చిక్కుకున్న పేదలను మనం సైతం సభ్యులు ఆదుకుంటూ మానవతను చాటుతున్నారు. పట్టువదలకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది మనం సైతం. సోమవారం హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో పది మంది పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వీరిలో విద్యా, వైద్యం, క్రీడలు వంటి వివిధ అవసరార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు, దర్శకులు దశరథ్, న్యూస్ రీడర్ దీప్తీ వాజ్ పేయి, పాత్రికేయులు సాయి, మనం సైతం సభ్యులు బందరు బాబీ, అనిల్ కుమార్, వినోద్ బాలా, సురేష్, కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు చెక్ లు అందజేశారు.

 

అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…పరిశ్రమలో సుదీర్ఘ అనుభవాన్ని చూశాను. టీవీ కార్యక్రమాల నిర్వహణలో ఆర్థికంగా నష్టపోయాను. నా పక్కన నిలబడతారు అనుకున్న కొందరు కావాల్సిన సమయంలో దూరంగా వెళ్లారు. వీళ్లందరితో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పుస్తకంగా రాద్దామనుకున్నాను. కానీ అలా చేస్తే అంత మందికి దూరం అవ్వాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే లక్షలాది మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నేను ఎదుర్కొన్న బాధల కోపం, కసి , ప్రతీకారం, ఆవేదనకు మరో కోణంలో మొదలైందే మనం సైతం. నేను చేస్తున్నది ఏపాటి సాయమైనా వాళ్లకు ధైర్యాన్ని అందిస్తున్నాం. మేము అందిస్తున్న సాయానికి ఎన్నో రెట్లు దీవెనలు పొందుతున్నాం. ఇవాళం పదిమంది పేదలకు అతిథుల చేతుల మీదుగా చెక్ లు అందిస్తున్నాం. ఈ పెద్దల వల్ల మా సంస్థకు మరింత ప్రాచుర్యం వచ్చి మనం సైతం బిడ్డ ఆయుష్షు పెరుగుతుందని ఆశిస్తున్నాను. మా బృందం ఏడుగురితో మొదలైన మనం సైతం ఇవాళ లక్షా డైబ్భై వేల మంది సభ్యులను సంపాదించుకుంది. ఈ సంస్థ పేదల గుండెల్లోకి ఎంతగా వెళ్లిందంటే, మంత్రి గారు లక్ష్మారెడ్డి నియోజకవర్గం జడ్చర్లకు వెళ్తే…అక్కడ దాదాపు 70 మంది యువత వచ్చి మనం సైతం జడ్చర్ల శాఖ పెడతాం అన్నారు. అంతకంటే గర్వం ఇంకే కావాలి. అన్నారు.

ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…ఇంత గొప్పసేవా కార్యక్రమం చేస్తున్న కాదంబరి కిరణ్ కు అభినందనలు. పేదలకు డబ్బులు ఇవ్వడమే కాదు ఆత్మీయత పంచుతున్నారు. అవసరం ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆదుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ అంటే పోటీ. ఇక్కడ నిత్యం పరుగులు పెట్టాలి. అవన్నీ వదిలేసి పేదలకు సేవ చేయడం ఎంతో కష్టమైన పని. చిత్ర పరిశ్రమలో కొన్ని విభాగాల కార్మికులకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. అలాంటి శాఖల కార్మికులకు తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి సగం ఖర్చు మినహాయింపుతో ఆరోగ్య బీమా అందజేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాను. అలాగే చిత్ర పురి కాలనీలో ఒక వైద్యశాల నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. పేద సినీ కార్మికులకు వైద్యం అందజేసేందుకు కృషి చేస్తాం. అన్నారు.

శ్వేతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ….మనం సైతం కార్యక్రమానికి వచ్చాక మానవత్వం ఇంకా మిగిలి ఉందని అనిపిస్తోంది. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తున్నా…అందరికీ చేరువ కావడం కష్టం. అలాంటి సందర్భంలో మనం సైతం లాంటి సంస్థల అవసరం ఎంతైనా ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. కాదంబరి గారికి నా తరపున ప్రశంసలు తెలియజేస్తున్నాను. అన్నారు.

మనం సైతం సాయం పొందిన పేదలు..
ఈశ్వరమ్మకు ఆరోగ్యం – రూ. 25 వేలు
హెయిర్ డ్రెస్సర్ పి జయ, ఆరోగ్యం – రూ. 20 వేలు,
బీఎన్ రేఖ, విద్య – రూ.20 వేలు
చల్లా పవన్ కుమార్, – క్రీడలు రూ. 25 వేలు
కో డైరక్టర్ ఉమా మహేశ్వరరావు, – ఆరోగ్యం, రూ. 25 వేలు
ప్రొడక్షన్ మేనేజర్ బత్తుల హరిబాబు, – ఆరోగ్యం రూ. 25 వేలు
లైట్ మేన్ వేణుగోపాల్, విద్య – రూ.10 వేలు
సినీ మేనేజర్ ఆర్ మురళీ కృష్ణ, ఆరోగ్యం – రూ. 25 వేలు
పొట్టి జానీ, ఆరోగ్యం – రూ.10 వేలు
డ్రైవర్స్ యూనియన్ వెంకట లక్ష్మి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BipdPK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...