
చిత్ర దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ, ‘స్వయం వద` సినిమా ఫస్ట్ లుక్ ను మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రముఖ నిర్మాత లాగడపాటి శ్రీధర్ గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. స్వయంవద అనేది సాంస్కృత పదం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. తన గురించి తానే సర్వస్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్పబోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెటప్స్ లో కనిపిస్తుంది. అన్ని గెటప్స్ లోను డిఫరెంట్ వేరియేషన్స్ ఇస్తూ చాలా చక్కగా నటించింది అనికా రావు. హీరో ఆదిత్య అల్లూరి కొత్తవాడైనా చక్కగా నటించాడు. అందరికీ నచ్చే విధంగా కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ గా తెరకెక్కించాం. టెక్నికల్ గాను సినిమా హైలైట్ గా ఉంటుంది అన్నారు.
నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ: సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.టీజర్ ను పిబ్రవరి10న రిలీజ్ చేస్తాము.సినిమా ను మార్చి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో అర్చనా కౌడ్లీ, పోసాని కృస్‌న మురళి, ధన్ రాజ్, సారికా రామచంద్రరావు, రాంజగన్, లోహిత్ కుమార్, ఆనంద చక్రపాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత కల్ప, సోనీ హేమంత్ మీనన్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: మోహన్ జిల్లా, కెమెరా: వేణు మురళీధర్.వి, సంగీతం: రమణ.జీవి, ఎడిటింగ్: సెల్వ కుమార్, కథ,మాటలు, కథనం, దర్శకత్వం: వివేక్ వర్మ, నిర్మాత: రాజా దూర్వాసుల
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UBS6Ob

Comments
Post a Comment