Skip to main content

రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ‘కల్కి’ టీజర్ విడుదల!

'Kalki' Teaser launched on eve of Dr. Rajasekhar's birthdayయాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడుగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి‘. ‘అ!’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని ప్రేక్షకుల అభినందనల్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “సినిమా గురించి విడుదల తర్వాత మాట్లాడుతా. గరుడవేగ సమయంలోనూ సినిమా విడుదల తర్వాత మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు అంతే. గరుడవేగ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించాం. అప్పుడే కదా ఓకే చేశాం. తర్వాత ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశాం. గరుడవేగ కి ప్రవీణ్ సత్తారు తో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో…. ‘కల్కి’కి ప్రశాంత్ వర్మ తో పని చేసేటప్పుడు అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా. చాలా రోజుల విరామం తర్వాత సి కళ్యాణ్ గారి సంస్థలో నేను నటిస్తున్న చిత్రమిది. నాకు ప్రమోషన్ వచ్చినట్టు భావిస్తున్నా. కళ్యాణ్ గారు విషయం లేకపోతే సినిమా చేయరు. కథ నచ్చడమే సినిమా విజయంలో ఓ మెట్టు ఎక్కినట్టు. పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ చేస్తున్నాం. లోకంలో పని దొరకడం చాలా కష్టం నాకు పని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. జీవితం అన్నది చాలా తక్కువ రోజులు. అంతా సంతోషంగా అందరితో మంచిగా జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకుంటున్నా” అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ “మా హీరో రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూపర్ డూపర్ హిట్ గరుడవేగ తర్వాత… డిఫరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో కథ సాగుతుంది. ఇంకా 30 పర్సెంట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మిగతా షూటింగ్ పూర్తిచేసి మంచి తేది చూసి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా పూర్తి బాధ్యత ప్రశాంత్ వర్మ మీద పెట్టాం. దర్శకుడికి అతడు తొలి సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘శేషు’ తర్వాత రాజశేఖర్ గారి తో నేను చేస్తున్న చిత్రమిది. నా సంస్థలో పనిచేయడం ప్రమోషన్ అని ఆయన అన్నారు. అది తప్పు. సి.కళ్యాణ్ అనే నిర్మాత చిన్న సినిమాలు చేసేటప్పుడు… లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని నన్ను నిర్మాతను చేశారు జీవిత రాజశేఖర్ దంపతులు. గోరింటాకు సినిమా కు నాకు ఎంతో సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులతో నేను చేస్తున్న చిత్రమిది” అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “నేను ‘అ!’ చిత్రానికి ముందే జీవిత గారిని కలిశా. అప్పుడే ఈ సినిమా చేద్దాం అనుకున్నాం. చాలా రోజులు వెయిట్ చేసి ఈ సినిమా ప్రారంభించాం. ఆ చిత్రానికి ఎంత కష్టపడ్డానో…. దానికి పదిరెట్లు ఈ చిత్రానికి కష్టపడ్డా. ఇదేమీ కాంప్లెక్స్ కథ కాదు. స్క్రిప్ట్ వర్క్ లో చాలా డీటెయిలింగ్ చేశాం. రాజశేఖర్ గారి తో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన చాలా జోకులు వేస్తూ ఉంటారు. జీవిత గారి ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. వాళ్ల మీద నాకు ఒక్కటే కంప్లైంట్… ఫుడ్ ఎక్కువ పెడతారు. సినిమా కోసం ఒక్కరోజు 48 గంటలు కంటిన్యూగా షూట్ చేశాం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రతి పూట బెస్ట్ ఫుడ్ పెట్టేవారు. నేను అది తింటూ బరువు పెరగకూడదన్న కొనే వాడిని. ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 70 డ్రాప్స్ రాశాను. కల్కి అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. టైటిల్లో ఎందుకంత డీటైలింగ్ చేశామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నా ఫస్ట్ సినిమా అందరికీ అర్థం కాలేదు. ఇది అలా కాదు అందరికీ అర్థమవుతుంది. ‘కల్కి’ కమర్షియల్ సినిమా. ఇంతకు ముందు వచ్చిన కమర్షియల్ సినిమా సూత్రాలను పాటించకుండా… కొత్త కమర్షియల్ ఫార్మాట్ సృష్టించే సినిమా. ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. ఒక ఫ్రాంచైజీ తరహాలో. అన్నీ కుదిరితే రాజశేఖర్ గారు నెక్స్ట్ బర్త్ డే కి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్ గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను యాంగ్రీ స్టార్ అనే బిరుదు ఇస్తున్నా. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా” అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ “గరుడవేగ పెద్ద హిట్ అయింది. తర్వాత ఏం చేయాలి అనేది ప్రశ్న. గరుడవేగ కి ముందు ఎన్నో భయాలు ఉండేవి. అధ పాతాళానికి వెళ్లి పోయిన తర్వాత మళ్లీ సక్సెస్ లోకి రాగలుగుతామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనక ఎన్ని కోట్లు ఉన్నా డబ్బుతో కెరీర్ ని కొనలేం. అటువంటి సమయంలో గరుడవేగా వచ్చింది. ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడుతున్నప్పుడు గరుడవేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సినిమా విడుదలైన సమయంలో మా అత్తగారిని, మా అన్నయ్య మురళిని కోల్పోవడం చాలా బాధాకరం. నేను మా అన్నయ్య ని ఎలా ఒరేయ్ పోరా అంటుంటాను. అందువల్ల చాలామంది మురళీ నాకు తమ్ముడు అనుకుంటారు. నేను అన్నయ్య అని పిలిచేది కళ్యాణ్ గారిని. గరుడవేగ తర్వాత ఆయన ఒకసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగారు. ‘కల్కి’ సినిమా గురించి చెప్పా. ‘ఇప్పటివరకు నువ్వు సంపాదించిన ఏం లేదు అన్ని పోగొట్టుకు న్నావ్. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఈ సినిమా నేను చేస్తా’ అన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం చాలా కష్టం. ఓ మహిళగా నాకు ఇంకా కష్టం. మనకు రావాల్సిన డబ్బులు మనం తెచ్చుకోవడానికి పెద్ద ఫైట్ చేయాలి. ఇలాంటి సమయంలో కళ్యాణ్ అన్నయ్య సినిమా చేస్తాను అనడం సంతోషంగా ఉంది. సినిమా కథ స్క్రీన్ ప్లే డైలాగులు ప్రశాంత్ వర్మ రాశాడు. ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ ఇస్తా అన్నాడు. వర్క్ పూర్తయిన తర్వాత అతన్ని డైరెక్షన్ చేయమని చెప్పాను. ‘అ!’ విజయం తర్వాత అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. ఏ సినిమా చేయాలి అని ఆలోచించుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఎవరకు సినిమా చేస్తానన్నాడు. ప్రశాంత్ వర్మ. అంగీకరించడమే సగం విజయం గా నేను భావించాను. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే నెలలో సినిమాను విడుదల చేయాలని కోరుతున్నా.” అన్నారు.

ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివానీ శివాత్మిక సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ కేక్ కట్ చేశారు.

అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ – సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GjKpbj

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...