Skip to main content

సువ‌ర్ణ‌సుంద‌రి సుపర్ న్యాచ‌ర‌ల్ థ్రిల్ల‌ర్‌-ఇంద్రా

Suvrna Sundari movieజయప్రదపూర్ణసాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో  భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  విధంగా ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మార్చి రెండ‌వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర హీరో ఇంద్రా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ…

 

సినిమా గురించి…

సువ‌ర్ణ‌సుంద‌రి ఇటీవ‌లె థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లై మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా మొద‌లైన‌ప్పుడు చాలా చిన్న సినిమాగా మొద‌లై ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయింది. ఈచిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కి అప్లైచేశాము. ఈ చిత్రం విడుద‌ల‌వ్వ‌డానికి అన్ని విధాల రెడీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత మంచిగా రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం సూర్య‌గారే.

 

మీ క్యారెక్ట‌ర్ గురించి…

నా పేరు ఇంద్ర. ఇందులో నేను లీడ్ రోల్‌లో న‌టించాను. ఈ చిత్రాని కంటే ముందు నేను వంగ‌వీటిలో న‌టించాను. రామ్‌గోపాల్‌వ‌ర్మ్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ చిత్రంలో నేను ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాను. లీడ్ రోల్‌లో చెయ్య‌డం ఇదే మొద‌టిసారి నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన డైరెక్ట‌ర్ సూర్య‌గారికి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ఒక యాక్ట‌ర్‌ని న‌మ్మి ఒక లీడ్ రోల్ ఇవ్వ‌డం అనేది ఈ రోజుల్లో సామాన్య‌మైన విష‌యం కాదు. నారోల్ రొమాంటిక్‌గా ఉంటుంది. ఇందులో రెండు స్ర్కీన్‌ప్లేలు న‌డుస్తూ ఉంటాయి. ఒకటి పీరియాడిక‌ల్‌, ఇంకోటి ప్ర‌జంట్‌. నేను సాక్షికి పెయిర్‌గా చేశాను. ఒక రొమాంటిక్ హీరోగా క‌న‌ప‌డ‌తాను. ఈ రెండు స్ర్కీన్‌ప్లేల మ‌ధ్య నాదొక ఫ‌న్ అండ్ రొమాంటిక్ క్యారెక్ట‌ర్ చాలా బావుంటుంది. డ‌బ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే సినిమా చాలా బాగా వ‌చ్చింది.

 

డైరెక్ట‌ర్ గురించి…

సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది. ఆయన ఎంత బాగా తీశారు అన్న‌ది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప‌బ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నీ ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.

 

డ‌బుల్ రోల్ చేశారా…

లేదండి సింగ‌ల్ రోల్‌. సాక్షి డ‌బుల్ రోల్ చేశారు. నేను ప్ర‌జంట్ జ‌న్మ‌లో ఆమెకు పెయిర్‌గా చేశాను.

 

సువ‌ర్ణ సుంద‌రి అంటే…

సువ‌ర్ణ‌సుంద‌రి అంటే ఒక విగ్ర‌హం.ఆకాలం ఆరు వంద‌ల సంవ‌త్స‌రాల‌ నుంచి ఈ కాలం వ‌ర‌కు క‌థ‌ ట్రావెల అవుతుంది. దానికి సంబంధించిన సినిమా ఇది.

ఒక సోషియో ఫ్యాంట‌సీ మూవీ. మైథ‌లాజిక‌ల్ కూడా. హైబ‌డ్జెట్ మూవీ అనుకున్నాం కానీ ఇంకా చాలా హై బ‌డ్జెట్ అయింది. సినిమా పైన ప్యాష‌న్‌తో జ‌నాలు ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో సూర్య‌గారు చేశారు. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది.

 

టెక్నిక‌ల్‌గా సినిమా ఎలా ఉంటుంది…

విఎఫ్ఎక్స్ సినిమాకి బాగా కుదిరాయి మంచి అనుభూతినిస్తాయి. ఈచిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి మంచి టెక్నీషిన్స్‌. మ్యూజిక్ సాయికార్తిక్‌, కెమెరాః మ‌హంతి మేము స్క్రీన్‌లో చూసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. సాంగ్స్ బాగా వ‌చ్చాయి. మంచి మంచి సినిమాలు చేసిన ప్ర‌వీణ్‌పూడి ఈ సినిమాకి  ఎడిట‌ర్ గా కుదిరారు. ఎక్క‌డా ఖ‌ర్చుకి వెన‌కాడ‌కుండా భారీ బ‌డ్జెట్ సినిమాలాగా చేశారు. ఈ సినిమాలో అదే ఖ‌ర్చు మీకు ఖచ్చితంగా క‌నిపిస్తుంది.

 

 

సాక్షి గురించి…

సాక్షి చాలా బాగా చేశారు. త‌ను చాలా సినిమాల్లోనే చేశాను. షూటింగ్ టైంలో నాకు కూడా యాక్టింగ్ ప‌రంగా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో అంద‌రూ చాలా బాగా చేశారు. సాయికుమార్‌, జ‌య‌ప్ర‌ద‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన సినిమాలో చేయ‌డం నా అదృష్టం. జ‌య‌ప్ర‌ద‌గారితో నాకు సీన్స్ ఏమీ లేవు.

 

మీ గురించి…

నేను విజ‌య‌వాడ‌లో పుట్టాను. నేను దాస‌రికిర‌ణ‌కుమారిగారి క‌జిన్‌ని రామ్‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మాదే. కాని నేను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రౌండ్ ఎక్క‌డ చెప్ప‌కుండానే ఆడిష‌న్స్‌కి వెళ్ళాను. నేను వంగ‌వీటిలో చేస్తుండ‌గా నాకు సూర్య‌గారు ఫోన్ చేసి ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు.

 

యాక్టింగ్ నేర్చుకున్నారా…

మ‌ధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. స్వ‌ర్గీయులు శ్రీ‌రామ్‌గారిద‌గ్గ‌ర నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్‌తో నేను ప్రాక్టీస్ చేశాను. ఆయ‌న వంగ‌వీటి చేస్తున్న‌ప్పుడు కూడా ఆయ‌న‌కు నేనెవ‌రో తెలియ‌కుండానే నాకు పాత్ర‌ని ఇచ్చారు.

 

త‌ర్వాత ప్రాజెక్ట్స్‌…

రామ‌చ‌క్క‌ని సీత అనే చిత్రంలో చేస్తున్నాను అందులో కూడా లీడ్ రోల్ లో చేస్తున్నాను. ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీ‌హ‌ర్ష మండా గారితో చేశాను. ఈ రెండూసినిమాలు  డిఫ‌రెంట్ జోన‌ర్స్. 5,6రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. అది కూడా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోడానికి ఈ రెండు సినిమాలు నాకు మంచి అవ‌కాశాలుగా భావిస్తున్నాను. ఈ సినిమా మార్చిరెండో వారంలో మీ ముందుకు రాబోతుంది.  ఈ సినిమా చూసి న‌న్ను ఆద‌రిస్తార‌ని  నాకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని కోరుకుంటున్నాను అన్నారు.

English Title: Suvarna Sundari super natural thriller – Indhra

Raai lakshmi very hot in yogaNani heroine Siddhika sharma gives hot vibesJeetendra daughter Ekta kapoor turns MomAttack on jabardasth nareshMahesh babu Maharshi dubbing work started



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2TNoNbk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...