నందమూరి తారకరత్న కు చెందిన రెస్టారెంట్ ని కూల్చేశారు జి హెచ్ ఎం సి అధికారులు . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో కబరా డ్రైవ్ రెస్టారెంట్ ని నిర్వహిస్తున్నాడు తారకరత్న . అయితే నిబంధనలకు విరుద్దంగా ఈ రెస్టారెంట్ కొనసాగిస్తున్నారని అలాగే రాత్రి పూట మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని , డీజే సౌండ్ పెద్ద ఎత్తున పెడుతూ చుట్టుపక్కల వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన జి హెచ్ ఎం సి అధికారులు రెస్టారెంట్ ని కూల్చేశారు .అధికారుల తీరుతో తారకరత్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో తారకరత్న వెనక్కి తగ్గాడు . అసలే సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తారకరత్న కు ఇలా రెస్టారెంట్ రూపంలో మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి .
English Title: Nandamuri Tarakaratna restaurant was demolished GHMC
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2WG8Ghx

Comments
Post a Comment