Skip to main content

ఏప్రిల్ 19 న రాఘ‌వ లారెన్స్ “కాంచ‌న‌-3”

Raghava Lawrence’s ‘Kanchana-3’ will hit the screens on 19th of April worldwide.ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, తన   స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ  కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ  సౌత్ ఇండియా లో   బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. రాఘ‌వ లారెన్స్ ఏం చేసినా స్పెష‌ల్ గా, సెన్సేషన్ గా ఉంటుంది.

ఇటీవలె కాంచ‌న‌-3 కోసం విడుదల చేసిన మొదటి లుక్ మోషన్ పోస్టర్ ఒక మాసివ్ వేవ్ ని తీసుకొచ్చింది.. అటు సినీ ప్రేక్షకులు నుండి ఇటు సామాన్య ప్రేక్షకుడు నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మోషన్ పోస్టర్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టర్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులొ మొట్టమెద‌టి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో ఈ మోషన్ పోస్టర్ ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో  ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. ఇప్పటికే రీ-రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2019 కి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవనుందని టెక్నిషన్స్ నుండి వస్తున్న సమాచారం తో ట్రేడ్ లో మోస్ట్ క్రేజి ఫిల్మ్ గా అంచనాలు పెరిగాయి.. అతి త్వరలో వచ్చే ట్రైలర్ ఈ అంచనాలు థ్రిబుల్ చేయనుందని యూనిట్ అంటున్నారు.. అంతేకాదు అంచనాల్ని మించి ఈ చిత్రం ఏప్రిల్ 19 న సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

ఈ సంద‌ర్బంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ…. కాంచన 3 చిత్రం నా కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు వాటికి మంచిన కథా బలంతో వస్తున్నాం. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220  రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతీ చిన్న విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఆ రెస్పాన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ను లావిష్ గా కట్ చేస్తున్నాం. త్వరలో రిలీజ్ చేయనున్న ఆ ట్రైలర్ తో అంచనాలు తారాస్థాయికి చేరతాయిని ధీమాగా చెబుతున్నాం. తమన్ అద్భుతమైన రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇందులో నా గెటప్ కు చాలా మంచి పేరొచ్చింది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగులో బి.మధు గారు విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

 

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫి- వెట్రి, స‌ర్వేష్ మురారి,

మ్యూజిక్ – తమన్

పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం – రాఘ‌వ లారెన్స్‌

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HpD636

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...