Skip to main content

ప్రేమ అంత ఈజీ కాదు సినిమాకు సెన్సార్ ప్రశంసలు.. యూ సర్టిఫికెట్‌తో 29న రిలీజ్

prema antha easy kadu movie press meetపారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ టీ అంజయ్య  చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు.

అనంతరం, సమర్పకులు టీ అంజయ్య మాట్లాడుతూ ప్రేమ అంత ఈజీ కాదు సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. మా సినిమా చూసి సెన్సార్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మా చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా మా సినిమాను రూపొందించాం. అందుకు సెన్సార్ ప్రశంసలు లభించడం మాకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చింది. మా సినిమా విజయం సాధిస్తుందనే అంశానికి మరింత విశ్వాసం కలిగింది అని అన్నారు.

హీరో రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అంతా చూసే విధంగా ఉన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. యూ సర్టిఫికెట్ ఇస్తూ అభినందించారు. మహకవి శ్రీశ్రీ చెప్పిన ప్రకారం.. ‘ఏ నటుడు చేసిన రక్తి కట్టించే పాత్రలు ఉన్నాయి. పాత్ర అయినా రక్తికట్టించే నటులు ఉన్నారు’ అన్నారు. మా సినిమా రెండో వ్యాఖ్యకు సరిపోతుంది. చాలా కష్టపడి సినిమాను అద్భుతంగా తీసుకొచ్చాం. తప్పుకుండా విజయం సాధిస్తుందనే భరోసా ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్ వచ్చే చిత్రాలు కనిపించడం లేదు. మా సినిమాకు యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉంది. ప్రేమ అంత ఈజీ కాదు మా టైటిల్. అయితే మేము సిని నిర్మాణంలో దిగిన తర్వాత సినిమా తీయడం కూడా ఈజీ కాదు అని తెలిసింది. సినిమా మొదలైన తర్వాత కొందరు చాలా తప్పుగా మాట్లాడారు. ప్రసాద్ ల్యాబ్‌లో మురిగిపోయే మరో సినిమా అని కొందరు వాగారు. ఎవరైనా ఏదైనా చేస్తే సహకరించకపోయినా.. ఇలా దెబ్బ తీసే విధంగా మాట్లాడొద్దు. ఏదిఏమైనా మేము అనుకొన్న ప్లాన్ ప్రకారం మార్చి 29న రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

నిర్మాతలు శ్రీధర్, నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది. ఖోఖో’. ప్లాష్‌ న్యూస్‌, ‘వెతికా నేను నా ఇష్టంగా’ వంటి  చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న రాజేష్‌కుమార్‌ ఇందులో అద్భుతంగా నటించారు. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్‌ పువ్వామా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చెప్పారు.

నటీనటులు: ధనరాజ్‌, రాంప్రసాద్‌, ముక్తార్‌ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి ఛాయగ్రహణం: చక్రి, సంగీతం: జై.యం, ఎడిటింగ్‌ : శ్రీనివాస్‌ కంబాల…

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2USo2y4

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...