Skip to main content

“కిల్లర్” స్నీక్ పీక్ టీజర్, ఆడియో విడుదల

killer movie teaser audio launchఅర్జున్ ‌,విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తొన్న చిత్రం ” కిల్లర్”. హంతకుడు అనేది ట్యాగ్లెన్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. బి.ప్రదీప్ సమర్పణలో ,దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్ర స్నీక్ పీక్ టీజర్ ను,అర్జున్ బిగ్ సిడిని విడుదల చేశారు.

సైమన్ కె.కింగ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు గా ఇది నా తొలి తెలుగు చిత్రం. 3 పాటలుంటాయి. వేటికవే విభిన్నమైనవి. భాష్యశ్రీ మంచి లిరిక్స్ ను ఇచ్చారన్నారు.

భాష్యశ్రీ మాట్లాడుతూ.. అన్నీ విబాగాల్లో ఇదొక అద్బుత చిత్రం. విజయ్ ఆంథోనీ, అర్జున్ గారి నటన కిల్లర్ సినిమాకు హైలెట్ . ఇదొ స్టైలీష్ క్రైమ్ థ్రిల్లర్. ప్రేక్షకుల కు తరువాత ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఉంటుందన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అర్జున్, విజయ్ ఆంథోని తెలుగులో హిట్స్ ఇచ్చిన నటులు.‌ వారు గౌరవ ప్రదమైన నటులు. వీరి కాంబినేషన్ లో వస్తొన్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆసిస్తున్నానన్నారు.

అషిమా మాట్లాడుతూ.. దర్శకనిర్మాతల వల్ల ఈ సినిమా లొ అవకాశం వచ్చింది. అది కూడా అర్జున్ ,విజయ ఆంథోని ల తో నటించటం అదృష్టం. అందరికీ నచ్చుతుందని నమ్ముతామన్నారు.

ఆండ్రూ‌ లూయిస్ మాట్లాడుతూ..నాకు తెలుగు రాకున్నా ,తెలుగు వారికి నచ్చె సినిమా తీశాము. విజయ్ ఆంథోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్ గారు మా సినిమాలొకి రావటమే మా మొదటి సక్సెస్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ .టెక్నికల్ గా కిల్లర్ నెక్ట్స్ లెవెల్ మూవీ . నిర్మాత ప్రదీప్ సపోర్ట్ మాకు ప్రధాన బలమన్నారు.

విజయ్ ఆంథోనీ మాట్లాడుతూ.. అర్జున్ గారితొ కలిసి ఈ సినిమా చెయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే . అషిమా ఈ సినిమాతో డ్రీమ్ గర్ల్ గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు గాడ్ ఫాదర్.భాష్య శ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు.
మంచి సినిమా చేశాము. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారన్నారు.మే లో విడుదల చెస్తామన్నారు.

అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ సినిమాలొ చాలా రొజుల తర్వాత పొలీస్ గా చెస్తున్నా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దర్శకుడి ప్రతిభ, తాను రాసిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. విజయ్ ఆంథోనీ మంచి మనిషి. కిల్లర్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకొవాలన్నారు.

అర్జున్ ,విజయ్ ఆంథోని , అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి:మాటలు,పాటలు: భాష్యశ్రీ,సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: వినొద్ రాజ్ కుమార్, సమర్పణ: బి.ప్రదీప్, నిర్మాణం: దియా మూవీస్, కథ-కథనం- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.
పి.ఆర్.ఓ: సాయి సతీష్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2YoTPJq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...