Skip to main content

టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం – కాదంబరి కిరణ్

Kadambari Kiran Supports CM KCRసినిమా లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాను అని, ఎన్నో బాధలు పడ్డానని, ఎన్నో చేదు అనుభవాలు ఎదురుచూసిన తర్వాత వాటన్నిటి నుంచి వచ్చింది మనం సైతం అని దీని ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చి నేడు  కెసిఆర్ అభివృద్ధి పథకాలకు అభినందనలు తెలుపుతూ తెరాస కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు ప్రముఖ నటులు, సామాజిక వేత్త కాదంబరి కిరణ్. ఇందుకు తన  స్నేహితులు , సినీ నటులు అందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మనం సైతం ఆధ్వర్యంలో తెరాస కు మద్దతు పలికారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో మూడు వేల మంది కార్మికులనుంచి తెరాస కు మద్దతు పలుకుతూ చేసిన తీర్మానాన్ని జూనియర్ ఆర్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి   బందరు బాబీ కి కాదంబరి కిరణ్ సమక్షం లో  అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ….

చిన్న సారు కారు సర్కారు పదహారు అనే నినాదంతోటి తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందిగా అందరిని కోరుతున్నామని, ఈ ఎన్నికల్లో ఎంపీగా నిలబడిన 16 మందికి మా సపోర్టు ఇచ్చి ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయదలచుకున్నామని చెప్పారు.    తెలంగాణ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  నా భుజం తట్టి  ముందు నన్ను ప్రోత్సహించారని, అందుకే టిఆర్ఎస్ గవర్నమెంట్ కు సపోర్ట్ చేయాలి అనుకున్నానని , టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకున్నానట్టు పేర్కొన్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి   బందరు బాబీ మాట్లాడుతూ సినీ కార్మికులందరూ తెరాస కు సపోర్ట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పేదవారికి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పధకాలు ఎంతో ఆకట్టుకున్నాయని, ప్రాంత బేధాలేకుండా ఇక్కడ అందరూ స్వేచ్ఛగా వున్నారని, తలసాని శ్రీనివాస్ యాదవ్ తమకు  అందిస్తున్న ఆధార అభిమానం మర్చిపోలేమన్నారు.

జూనియర్ ఆర్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ వల్లభనేని తెరాస కు మద్దతు తెలుపుతు ఇచ్చిన తీర్మానం తో ముందుకు వచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యగల వ్యక్తిగా కెసిఆర్ నిలవడం అభినందనీయమని, ఇప్పుడు కెసిఆర్ అభిమానులుగా వివిధ పార్టీలనుంచి మరింతమంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కేటీర్ సారధ్యం లో పని చెయ్యడానికి ముందున్నామని, సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ గెలుపుకు శాయశక్తులా కృషి చేస్తామని అనిల్ వల్లభనేని పేర్కొన్నారు. సినీ ప్రముఖులందరూ ముందుకొచ్చి తెరాస కు మద్దతు పలకాలని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FFIT19

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...