Skip to main content

‘ఇది నా సెల్ఫీ’ చిత్రం.. సెల్ఫీ కాంటెస్ట్ తో బహుమతులు… !!

idi naa selfie movie press meetవినోద్‌, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్) స్వీయ దర్శకత్వంలో చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో  శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు  నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’.. పోతుమర్తి సతీష్ గాయ్ సహనిర్మాత గా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది..  ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. శ్రీనివాస్‌ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదల కాగా ఆ ఆడియో కి సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.. అంతేకాకుండా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులను కూడా అందజేయనున్నారు..ప్రేక్షకులు ఆసక్తికరమైన సెల్ఫీ ని ఫేస్ బుక్ లో ‘ ఇది నా సెల్ఫీ’ పేజీ కి టాగ్ చేసి పోస్ట్ చేయాలి.. దాంట్లో ఉత్తమమైన సెల్ఫీ ని ఎంపిక చేసి విజేతలుగా నిర్ణయిస్తారు..

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత , దర్శకుడు సి.హెచ్ ప్రభాకర్ (చరణ్) మాట్లాడుతూ… సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది.. రెండు గంటలు ప్రేక్షకులని మెప్పిస్తుంది.. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు..సెల్ఫీ ల మోజులకే  పరిమితమయిపోతున్న ఈ జనరేషన్ ని మార్చే సినిమా ఇది.. మంచి ఎంటర్ టైన్మెంట్ తో కూడిన కథ .. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్.. సినిమా ఇండస్ట్రీ లో చాల మంది పెద్ద మనుషులు ఉన్నారండి.. కానీ పెద్ద మనసున్న మనుషులు కొంతమందే ఉన్నారు.. అందులో రాజ్ కందుకూరి గారు ఒకరు.. మా చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు..  సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన టెక్నిషియన్స్, నటీనటులకు నా కృతజ్ఞతలు.. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన పోతుమర్తి సతీష్ గాయ్ గారికి కృతజ్ఞతలు.. తప్పకుండా ఈ సినిమా ని చూసి ప్రేక్షకులు విజయవంత చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు..

 

సహా నిర్మాత సతీష్ గాయ్ మాట్లాడుతూ.. ఈ సినిమా లో నటించిన అందరికి ధన్యవాదాలు.. ఎప్పటికైనా సినిమాల్లో కి రావాలనేది నా కల..అలాటి టైం లో నాకు ప్రభాకర్ గారు పరిచయడం అవడం.. ఈ సినిమా కథ నచ్చి వారితో కలిసి తీయడం జరిగింది.. అందరికి నచ్చే సినిమా.. మంచి సోషల్ మెసేజ్ ఉంది..  మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు.. తప్పక ఈ సినిమా చూడండి అన్నారు..

 

నటుడు  బి హెచ్ ఈ ఎల్  ప్రసాద్  మాట్లాడుతూ..  మా సినిమా ని  ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు.. సినిమా తీయాలనే   ప్యాషన్ తో వచ్చిన నిర్మాత ప్రభాకర్ గారు.. అలాంటి నిర్మాత నుంచి వస్తున్న మొదటి సినిమా..చాల మంచి కథతో వస్తున్నారు.. టీం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా ని చేశారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది.. .. అందరూ తప్పక చూసి ఆనందించండి.. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది.. అన్నారు..

 

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్ చాల బాగుంది.. విజువల్స్ చాల బాగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది.. నటీనటులు చాల బాగా చేశారు.. ఈ సినిమా అందరు తప్పక చూడండి.. అన్నారు..

 

హీరో వినోద్ మాట్లాడుతూ.. సెల్ఫీ కాన్సెప్ట్ తో ఒక మంచి సినిమా చేసాం.. ఈ సినిమా కోసం అందరం చాల కష్టపడ్డాం.. సినిమా చాల బాగా వచ్చింది.. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా చేశారు.. అందరు నటీనటులు చాల బాగా చేశారు.. ఈ సినిమా ని , మమ్మల్ని అశిర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. అందరు ఈ సినిమా ని తప్పక చూడండి.. అన్నారు..

 

నటీనటులు : సానియా, సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) , అనూష, వీర్ కరణ్, దిలీప్, సురేష్,కర్ణాటక శ్రీనివాస్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, సుబ్బారెడ్డి..

 

సాంకేతిక నిపుణులు :

 

నిర్మాత & దర్శకుడు : సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్)

సహా నిర్మాత : పోతుమర్తి సతీష్ గాయ్ ఎమ్. ఏ, డి.ఎమ్.ఈ

బ్యానర్ : శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్

సమర్పణ : చెంచయ్య సుగుణమ్మ

మ్యూజిక్ : శ్రీనివాస్‌ మాలపాటి

సినిమాటోగ్రఫీ :  జి.శ్రీకాంత్, పి.జాన్సన్, రెమో, కరణ్ చంద్ర

ఎడిటింగ్ : వీరు

రచయితలు : సి.హెచ్ .ప్రభాకర్, సతీష్ గాయ్, డి. లక్కీ, శ్రీరామ్ రెడ్డి సైకం..

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ : సాగర్ చీకటిపల్లి, చోడవరపు లక్ష్మి, నాగభైరవ లీల

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HKn2t3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...