
సమర్పకుడు టి. అంజయ్య మాట్లాడుతూ “ప్రేమకు సంబంధించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కొత్త కోణంలో ప్రేమను ఆవిష్కరించాం. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా చూశామని వారు స్పందించడం నేను మర్చిపోలేను. మా అబ్బాయిలకు సినిమా తీయాలని ఎప్పటి నుంచో కోరిక. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు కూడా మంచి సినిమా తీయమనే అన్నాను. ట్రైలర్ బావుందని చూసిన వారందరూ అంటున్నారు. సినిమా పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ “మంచి డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను విడుదల చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని చెప్పే సినిమా ఇది. మెసేజ్ ఉంటుంది. పుట్టుకతోనే ప్రేమలో పడ్డ ఇద్దరు.. వారు పెరిగే కొద్దీ వారి ప్రేమ పెరిగిన తీరును ఈసినిమాలో చెబుతున్నాం“ అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ “కొత్తవాళ్లకు చాన్స్ ఇచ్చాం. నేను చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇంట్లో ఫాదర్, సన్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల చూసే చాలా అంశాలు ఈ సినిమాలో ఉంటాయి“ అని అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ “ఇందులో ప్రేమ అనే పాత్ర చేశాను. ఫ్యామిలీ సెంటిమెంట్లు బాగా ఉన్న చిత్రమిది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తుంది“ అని చెప్పారు.
హీరో మాట్లాడుతూ “ఎవరైనా రూ.100 పెట్టి టిక్కెట్ కొంటే, వారికి రూ.1000 వినోదం దక్కుతుంది. మా సినిమాకు బిజినెస్ బాగా జరిగింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Wt4h0m







Comments
Post a Comment