
‘ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే…’ అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారధ్యంలో గానం చేశారు. స్నేహంలోని మాధుర్యాన్ని ఎంతో అందమైన పదాలతో శ్రీమణి పాటగా మలిచిన తీరు బాగుంది. అంతే అందంగా, అంతే మధురంగా దేవిశ్రీప్రసాద్ ఈ పాటను అందరికీ కనెక్ట్ అయ్యేలా పాడారు. ఈ పాటకు శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి వారం ఒక పాట విడుదల చేయబోతున్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HZRpLi
Comments
Post a Comment