Skip to main content

మ‌హేష్‌బాబు వ్యాక్స్ స్టాట్చ్యు విడుద‌ల‌

Mahesh Babu Wax Statue Releaseమేడ‌మ్ టుసాడ్స్ రూపొందించిన సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ వ్యాక్స్ స్టాట్చ్యుని  హైద‌రాబాద్‌లోని ఏఎంబీలో సోమ‌వారం ఉద‌యం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మేడ‌మ్ టుస్సాడ్స్ త‌ర‌ఫున అలెక్స్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ “నా విగ్ర‌హాన్ని హైద‌రాబాద్  లో , ఇక్క‌డి సినీ ప్రియుల మ‌ధ్య విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌తేడాది వాళ్లు నన్ను సంప్ర‌దించారు. ర‌క‌ర‌కాల క‌ళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నార‌ని, కొల‌త‌లు తీసుకుంటున్నార‌ని అనుకున్నా. కానీ వారు విగ్ర‌హాన్ని మ‌లిచిన తీరు చాలా బావుంది. న‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒక‌సారి వాళ్లు ఆ ఫొటోల‌ను నాకు పంపించారు. వాటిని నా భార్య‌తోనూ, కొంత‌మంది స‌న్నిహితుల‌తోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశాన‌ని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసిన‌ట్టుగా చేసిన ఇవాన్ రీజ్‌, బెంటానా త‌దిత‌ర టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌గా, ఉత్కంఠ‌గా, ఒకింత భ‌యంగా, అన్నీ భావాలు క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌త‌దేశానికి చెందిన ప‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నా“ అని చెప్పారు.

మేడ‌మ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ “యునిక్ అకేష‌న్ ఇది. తొలిసారి మేం ఒకవ్యాక్స్ స్టాట్చ్యుని సింగ‌పూర్ కాకుండా, మ‌రోచోట విడుద‌ల చేస్తున్నాం. తొలిసారి మేం హైద‌రాబాద్‌కు వ‌చ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగ‌పూర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మ‌హేష్‌ని ఎంతో మంది రిఫ‌ర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డి ఈ స్టాట్యూని చేశారు. దాదాపు మ‌హేష్‌కి సంబంధించిన 200 మెజ‌ర్‌మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొల‌త‌లు తీసుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌బాబు స్టాట్యూని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది“ అని అన్నారు.

ఏవీయంగ్ కాంగ్  మాట్లాడుతూ “మ‌హేష్ స్టాట్చ్యుని చూడ‌టానికి సింగ‌పూర్‌కి వ‌స్తార‌ని భావిస్తున్నా“ అని అన్నారు.

మ‌హేష్ మైన‌పు విగ్ర‌హాన్ని చూసిన న‌మ్ర‌త స్పందిస్తూ “నాకు ఇద్ద‌రు భ‌ర్త‌ల‌ను చూసిన‌ట్టు ఉంది. రియ‌ల్ గా ఉన్న వ్య‌క్తి అందంగా ఉన్నారు. స్టాట్యూలో ఉన్న వ్య‌క్తి ఆయ‌నంత అందంగా ఉన్నారు“ అని అన్నారు.

 

ఆ త‌ర్వాత జ‌రిగిన ప్ర‌శ్న‌జ‌వాబుల కార్య‌క్ర‌మం వివ‌రాలు…

* మ‌హేష్‌, ఇది వ‌ర‌కు ఎప్పుడైనా మేడ‌మ్ టుసాడ్స్ వెళ్లారా? అప‌్పుడు మీకు ఎలా అనిపించింది?

ఆరేళ్ల క్రితంలండ‌న్‌లో మ్యూజియమ్‌కి  వెళ్లాను. నా పిల్ల‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అక్క‌డ ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌తో ఫొటోలు తీసుకున్నారు. వాళ్ల‌ను చూసిన త‌ర్వాత ఎప్పుడో ఒక‌రోజు నా బొమ్మ ఇక్కడికి వ‌స్తుంద‌ని అనుకున్నా. ఇప్పుడు అది జ‌రిగింది. సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్ కి ధ‌న్య‌వాదాలు. చాలా ఆనందంగా ఉంది.

* అలెక్స్… సింగ‌పూర్‌కి బ‌య‌ట తొలిసారి ఈ స్టాట్చ్యుని విడుద‌ల చేయ‌డానికి కార‌ణం ఏంటి?

– నిజ‌మే. తొలిసారి మేం ఇలా ఆవిష్క‌రిస్తున్నాం. మ‌హేష్ ఇక్క‌డ చాలా పెద్ద సూప‌ర్‌స్టార్‌. ఆయ‌న ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాల‌ని చేశాం.

* హైద‌రాబాద్ సిటీ ఎలా ఉంది?

– హైద‌రాబాద్ చాలా బావుంది. ప్ర‌జ‌లు ఈ లాంచ్ కి స‌పోర్ట్ చేయ‌డం చాలా బావుంది.

* మీ మైన‌పు ప్ర‌తిమ‌ను చూస్తుంటే  ఏమ‌నిపిస్తోంది మ‌హేష్‌?

– చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడ‌మ్ టుస్సాడ్స్ సింగ‌పూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్ల‌ల ముందు విడుద‌ల చేయ‌డం చాలా బావుంది. టీమ్‌కి థాంక్యూ.

* `మ‌హ‌ర్షి` గురించి చెప్పండి?

– నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.

* మీ బొమ్మ‌తో మీకు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఏం  మాట్లాడుతారు?

– ఎలా ఉన్నావు.. బావున్నా.. అని మాట్లాడుతా. (న‌వ్వుతూ) స్టాట్చ్యు చాలా బావుంది.

* మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్య‌మైంది?

– మెజ‌ర్‌మెంట్స్ అని ఒక‌సారి వ‌చ్చారు. స‌రేన‌ని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌గా ఉంటుంద‌ని అనుకోలేదు. నా పాదం సైజ్‌, నా చేతుల సైజు, నా రంగు, నా చ‌ర్మం, నా గోళ్లు… ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.

* ఇక మీకు సెల్ఫీ డిమాండ్ త‌గ్గుతుందేమో?

– నాకు సెల్ఫీలు వ‌చ్చినా నా బొమ్మ‌కు సెల్ఫీలు వ‌చ్చినా సేమే క‌దా.

* ఈ బొమ్మ‌ను చేయ‌డానికి ఎన్ని రోజులు ప‌ట్టింది?

– 20  మంది 6 నెల‌లు ప‌నిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.

* ఇలాంటివ‌న్నీ సింగ‌పూర్‌లో పెడ‌తారు. మ‌రి హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టారు?

– నా షెడ్యూల్స్ టైట్ వ‌ల్ల అక్క‌డికి వెళ్ల‌డానికి కుద‌ర‌లేదు. అందుకే వాళ్లు ఇక్క‌డికి వ‌చ్చారు. అది హాన‌ర్‌. నా పిల్ల‌ల ముందు దీన్ని విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

* మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా?

– సింగ‌పూర్ మ్యూజియ‌మ్‌కి వెళ్లి చూడొచ్చు. సినిమాల్లో కాదు.

* మ‌హేష్ స్టాట్యూని చేయ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకంగా ఏదైనా?

– ప్ర‌పంచంలోని ప‌లువురు చేసిన రిక్వెస్ట్ కార‌ణంగా మేం ఇది చేశాం.

* మీ స్టాట్యూ పెడుతున్నార‌ని తెలియ‌గానే.. ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు?

– మా ఆవిడ ఈ విష‌యాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. నాకు ఏదో అచీవ్ చేసిన‌ట్టు అనిపించింది.

* మైన‌పు విగ్ర‌హం చూడ‌గానే  ఇద్ద‌రు భ‌ర్త‌లున్నార‌ని న‌మ్ర‌త అన్నారు.

– ఇద్ద‌రు మ‌హేష్‌బాబులున్నార‌ని ఆవిడ మాట‌కు అర్తం అండీ.

* మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

* చాలా చాలా గౌర‌వంగా, థ్రిల్‌గా, ఆనందంగా ఉంది.

* ఈస్టాట్యూని చేయ‌డానికి మీరేమైనా స‌జెష‌న్స్ ఇచ్చారా?

–  అలాంటిదేమీ లేదు.

* ఈ లుక్ ఏ సినిమాలోది?

– ఈ లుక్ శ్రీమంతుడులో లుక్‌. శ్రీమంతుడు లో ఆ పోజు బావుంద‌ని చెప్పి, అలా పోజు ఇవ్వ‌మ‌ని అడిగారు.  అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని బ‌ట్టి  తీసుకున్నారు.

* భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత హాలిడే వెళ్లారు. మ‌హ‌ర్షి త‌ర్వాత ఏంటి?

– ఇంకా పెద్ద హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

 

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Fq7G9E

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...