
తెలంగాణ వచ్చాక రాష్ట్ర రాజకీయాలు అన్నీ తెలంగాణ చుట్టూ , అందునా కేసీఆర్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి దాంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు . నామా నాగేశ్వర్ రావు లీడర్ షిప్ ఎలాంటిదో తెలిసిన కేసీఆర్ ఖమ్మం పార్లమెంట్ సీటు ఇచ్చాడు . ఇక కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పలువురు నాయకులు , కార్యకర్తలు నామా గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు . అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున నామా నాగేశ్వర్ రావు కు బ్రహ్మరథం పడుతున్నారు . నాయకులు , కార్యకర్తలు , ప్రజల అండ పుష్కలంగా ఉన్న నామా ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నాడు . నామా విజయం ఖాయమై పోయింది కాకపోతే మెజారిటీ ఎంత అనేదాని కోసం శ్రమిస్తున్నారు . నామా విజయం నల్లేరు మీద నడకే అయినప్పటికీ ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా ప్రచారం సాగిస్తున్నారు నామా అండ్ కో .
English Title : Nama Nageshwar Rao is rocking in the campaign
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uw2TOV







Comments
Post a Comment