
సంతోష్ శివన్, జయం రాజా వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సతీష్.కె సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ….
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ – “సాహసం తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు బిను సుబ్రమణ్యం చెప్పిన కథ చాలా బావుంది. `సాహసం` ట్రెజర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో.. ఈసినిమా దాన్ని మించి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అన్ కాంప్రమైజ్‌డ్‌గా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TzwvVH







Comments
Post a Comment