
హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఈ సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్‌లో థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న విధానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఇంకా సక్సెస్ కావాలన్న కృషితోనే ఈ ప్రెస్‌మీట్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా ఈ సినిమా చూడకపోతే చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు సతీష్‌చంద్ర మాట్లాడుతూ… ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బావుందన్నారు. ఇంకా చూడని వాళ్ళు థియేటర్స్‌కి వెళ్ళి చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇది రెగ్యులర్ మూవీ కాదు. సినిమా చూసిన వాళ్ళందరూ సెకండ్‌హాప్ చాలా బావుందంటున్నారు. యూత్ సపోర్ట్ చెయ్యాల్సిన మూవీ ఇది అని అన్నారు.
ప్రొడ్యూసర్‌లక్ష్మణ్ మాట్లాడుతూ… మా సినిమా 22న విడుదలైంది. మీరందరూ చూసి ఆదరించినందుకు మా కృతజ్ఞతలు అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ…ముందుగా ఈ సినిమాని ఇంతగా ఆదరించినందుకు ఆడియన్స్ అందరికి బిగ్ థ్యాంక్స్. ఆడియన్స్ సినిమాని చూసి వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీ కొత్త వాళ్ళని ఎలాగైతే ఆదరిస్తుందో ప్రేక్షకులు కూడా మమ్మల్ని అదే విధంగా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా ఈ సినిమా చూడకపోతే వెళ్ళి థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బెక్కంవేణుగోపాల్‌గారు, లైన్‌ప్రొడ్యూసర్ లనిల్, రాజేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TpKP2U







Comments
Post a Comment