Skip to main content

ద‌ర్ప‌ణం ట్రైల‌ర్ లాంచ్‌

darpanam trailer launchశ్రీ‌నంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయ‌క ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద‌ర్ప‌ణం. క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి.ప్ర‌వీణ్ కుమార్ యాద‌వ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో   త‌నిష్క్‌రెడ్డి , ఎల‌క్సియ‌స్‌, సుభాంగి న‌టిస్తున్నారు.   రామ‌కృష్ణ. వెంప ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా సోమ‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు. విలేక‌రుల స‌మావేశంలో…

 

ర‌మ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ… ఈ చిత్రంలో చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి చేశాము. నేను ఈ చిత్రంలో ఒక క్యారెక్ట‌ర్‌ని చేశాను. ప్రొడ్యూస‌ర్ డైరెక్ట‌ర్ గారు నాకు చాలా స‌పోర్ట్ చేశారు.  నాకు ఈ చిత్రంలో ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి ప్రొడ్యూస‌ర్‌గారికి బాగా డ‌బ్బులు రావాల‌ని ఆయ‌న మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.

 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్దార్ధ్ మాట్లాడుతూ… నాకు హార‌ర్ థ్రిల్ల‌ర్ స్టోరీలంటే చాలా ఇష్టం. నేను ఈ క‌థ విన్న‌ప్పుడు స‌ర్‌ప్రైజ్ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. నేను ఈ చిత్రంలో రెండు పాట‌లు రాశాను. చాలా బాగా వ‌చ్చాయి. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

 

ప్రొడ్యూస‌ర్ క్రాంతి మాట్లాడుతూ… ఇది నా మొద‌టి చిత్రం మీరంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ బాగా న‌టించారు. టెక్నీషియ‌న్లు కూడా బాగా క‌ష్ట‌ప‌డ్డారు.  మీరంద‌రూ త‌ప్ప‌క మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

హీరో మాట్లాడుతూ… హీరోగా ఇది నా రెండో చిత్రం స‌క‌ల‌క‌ళావ‌ల్ల‌భుడు త‌ర్వాత నేను న‌టించిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ చూశాను చాలా బాగా వ‌చ్చింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ స‌స్పెన్స్ అంశాలు ఎక్కువ‌గా ఉంటాయి. నా మొద‌టి సినిమాకి అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఈ చిత్రానికి కూడా సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్ర ట్రైల‌ర్ ను అంద‌రికి షేర్ చేసి కొత్త‌వాళ్ళ‌ను ఎంక‌రేజ్ చెయ్యండి అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… ముందుగా నాకు స‌పోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కి, ఫ్రెండ్స్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. కేశ‌వ్‌గారి ద్వారా నాకు క్రాంతిగారు ప‌రిచ‌యం అయ్యారు. క్రాంతిగారు నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అన్నీ ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ సినిమా ముఖ్యంగా టెక్నీషియ‌న్స్‌ది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అందించిన ప్ర‌తి ఆర్ ఆర్ బిట్ నాతో డిస్‌క‌స్ చేసి అందించారు. ఎడిట‌ర్ గారు కూడా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా చిత్రాన్ని ఎడిట్ చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి పోయారు. ఈ చిత్రం ఒక క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌. మా సినిమాలో కామెడీ ఉండ‌దు. కామెడీ దెయ్యం సినిమా కాదు. జ‌బ‌ర్ద‌స్థ జోకులు ఉండవు. ఇది స‌స్పెన్స్ చిత్రం. లాస్ట్ మినిట్ వ‌ర‌కు ఏం జ‌రుగుతుందా అని స‌స్పెన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. డైరెక్ట‌ర్ టీమ్ అంద‌రూ బాగా హెల్ప్ చేశారు. నాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

 

హీరోయిన్ ఎల‌క్సియ‌స్ మాట్లాడుతూ… నేను  ఈ  చిత్రంలో మెయిన్ లీడ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడ‌టం రాదు.  మా యూనిట్ అంద‌రూ నాకు బాగా స‌పోర్ట్ చేసి తెలుగు నేర్పించారు. కొంచం కొంచం అర్ధ‌మ‌వుతుంది. ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ కూడా చాలా స‌పోర్ట్ చేశారు అన్నారు.

 

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ అంద‌రూ పాల్గొన్నారు.

 

టెక్నీషియ‌న్స్ః కెమెరామెన్ః స‌తీష్‌ముత్యాల‌, ఎడిట‌ర్ఃస‌త్య‌గిడుతూరి,  మ్యూజిక్ డైరెక్ట‌ర్ఃసిద్దార్ధ్ స‌దాశివుని, ప్రొడ్యూస‌ర్ఃక్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి. ప్ర‌వీణ్‌కుమార్ యాద‌వ్‌, డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంప‌.

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CAvOFO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...