Skip to main content

మార్చి 8న `సర్వం తాళమయం`

Sarvam Thaalamayam' On March 8thజి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం `స‌ర్వం తాళ‌మ‌యం`. రాజీవ్ మీన‌న్ తెరకెక్కించారు. మార్చి 8న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్ ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

రాజీవ్ మీన‌న్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో సంగీతం, మెరిట్‌, గెలుపు ఓట‌ముల గురించి ప్ర‌స్తావించాం. గురుశిష్యుల సంబంధం గురించి కూడా చెప్పాం. ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి మీద డాక్యుమెంట‌రీ చేస్తున్న స‌మ‌యంలో నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చింది. మృదంగం త‌యారుచేసేవాళ్ల‌కు వాయించ‌డం  చేత‌కాదు.

ఒక‌వేళ వారేగ‌నుక మృదంగం నేర్చుకుంటే ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం మీద ఈ సినిమా చేశాం. ఈ చిత్రం కోసం జి.వి.ప్ర‌కాష్ ఏడాది పాటు ఉమ‌యాళ్‌పురం శివ‌రామ‌న్‌గారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఈ చిత్రంలో సుమేష్ నారాయ‌ణ్‌, బాంబే జ‌య‌శ్రీతో పాటు చాలా మంది సంగీత విద్వాంసులు న‌టించారు. రెహ‌మాన్‌గారి సంగీతం చాలా ప్ల‌స్ అయింది. స్క్రిప్టు రాసుకునే స‌మ‌యంలోన నాకు ఓ బాణీ త‌ట్టింది. దాన్ని రెహ‌మాన్‌గారికి వినిపించాను. ఆయ‌న కూడా పెద్ద మ‌న‌సుతో ఆ ట్యూన్‌ను సినిమాలో ఉంచారు. రెహ‌మాన్ దిలీప్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచీ నాకు చాలా ఇష్టం. పాత ర‌ష్య‌న్ క్లాసిక్ సినిమాలు చూస్తుంటారు రెహ‌మాన్‌. అత‌ను దిలీప్‌గా ఉన్న‌ప్పుడు ఇళ‌య‌రాజాగారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశారు. ఆ త‌ర్వాత రాజ్‌కోటిగారి ద‌గ్గ‌ర చేశారు.

ఆ త‌ర్వాత ఒక‌సారి నేను బాయిల‌ర్ ఇండ‌స్ట్రీ మీద ఓ యాడ్ చేస్తే దానికి ఫ్యూజ‌న్ సంగీతాన్నిచ్చారు. అంత‌కుముందు ఒక‌సారి నాకు ప్లేట్ కింద‌ప‌డి విరిగే చ‌ప్పుడు తెర‌మీద కావాల‌నిపించింది. ఆరా తీస్తే `దిలీప్ చేస్తాడు` అని అన్నారు. అప్ప‌టి నుంచి ఏం విరిగినా రెహ‌మాన్ నాకు ఆ సౌండ్‌ని తెర‌మీద చూపించేవాడు. అలా ఒక‌సారి `విరిగే చ‌ప్పుళ్లే కాదు. మంచి సంగీతం కూడా చేస్తాను` అని అన్నాడు. ఆ త‌ర్వాత బాయిల‌ర్ ఇండ‌స్ట్రీ మీద చేశాం. ఆ త‌ర్వాత దాదాపు 150-200 జింగిల్స్ చేశాం. ఆ క్ర‌మంలోనే అత‌నికి `రోజా` వ‌చ్చింది. న‌న్ను `మెరుపుక‌ల‌లు` సినిమాకు ద‌ర్శ‌కుడిని చేసింది కూడా రెహ‌మానే. ఏవీయం సంస్థ వారు మంచి సినిమా చేయాల‌నుకున్నారు. దానికి రెహ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే రెహ‌మాన్ వాళ్ల‌కు అందుబాటులోకి వెళ్ల‌క‌పోవ‌డంతో న‌న్ను పిలిచి రెహ‌మాన్ గురించి అడిగారు.

నేను రెహ‌మాన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి `పెద్ద సంస్థనుంచి పిలుపు వ‌చ్చిన‌ప్పుడు వెళ్లి ఏదో ఒక‌టి చెప్పు` అని అన్నాను. ఆ రోజు అత‌నితో పాటు నేను కూడా ఏవీయం సంస్థ‌కు వెళ్లా. రెహ‌మాన్ వాళ్ల‌తో `ద‌ర్శ‌కుడిని డిసైడ్  చేశారా` అని అడిగారు. అందుకు వాళ్లు ఇప్ప‌టికి ప్ర‌భుదేవా మాత్ర‌మే ఓకే అయ్యారు. ఇంకా ఎవ‌రినీ డిసైడ్ చేయ‌లేదు` అని అన్నారు. `వేరే ఎవ‌రో ఎందుకు? మ‌న రాజీవ్‌ని చేసేయండి` అని రెహ‌మాన్ న‌న్ను సిఫార‌సు చేశారు. అలా నేను `మెరుపు క‌ల‌లు` చేశాను. దాని త‌ర్వాత `ప్రియురాలు పిలిచింది` పూర్త‌యింది. దాదాపు 19  ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమా చేశాను. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేస్తాను. సంగీతం ప్ర‌ధానంగా ఈ క‌థ‌ను చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు చాలా వ‌ర్క్ చేశాం. ద‌ళిత అంశాన్ని కూడా ట‌చ్ చేశాం. తెలుగులో ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నాం. కె.విశ్వ‌నాథ్‌గారు సినిమాను చూసి క్లైమాక్స్ లో క‌ళ్ల‌నీళ్లు పెట్టుకుని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్న స‌న్నివేశాన్ని మ‌ర్చిపోలేను“ అని అన్నారు.

జి.వి.ప్ర‌కాష్ మాట్లాడుతూ “మామావ‌య్య నా సినిమాకు సంగీతం చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాధ్య‌త‌గా ఈ సినిమాను చేశాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. సెటిల్ పెర్ఫార్మెన్స్ చేశాం. స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఏడాది పాటు మృదంగం నేర్చుకున్నా. ఈ సినిమా చేసిన త‌ర్వాత సంగీత ద‌ర్శ‌కుడిగానూ నాలో చాలా మార్పు వ‌చ్చింది“ అని అన్నారు.

నాయిక అప‌ర్ణ బాల‌ముర‌ళి మాట్లాడుతూ “రాజీవ్ మీన‌న్‌గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రాగానే అదేదో ప్రాంక్ కాల్‌ అని అనుకున్నాను. కానీ నిజంగా చాలా హ్యాపీగా ప‌నిచేశాను. ఈ చిత్రంలో న‌ర్సుగా సారా అనే పాత్ర చేశాను. సినిమాలో సాఫ్ట్ గా మాట్లాడుతుంటాను. కానీ చాలా స్ట్రాంగ్ పాత్ర చేశాను“ అని అన్నారు.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SBsnnr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...