Skip to main content

చిత్ర‌ల‌హ‌రి సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం

chitralahari movie press meetసుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. బుధ‌వారం సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

 

నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ – “ఇప్పుడే టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మీడియా మిత్రుల నుండి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. నివేదా పేతురాజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, సునీల్‌గారు న‌టించారు. మా `చిత్రలహ‌రి` సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టైటిల్ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఒక‌ప్పుడు అంద‌రికీ క‌నెక్ట్ అయిన చిత్రం. ఏప్రిల్ 12న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ మొద‌టి వారంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను కండెక్ట్ చేసి.. ఏప్రిల్ 12న విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండ‌మైన స‌క్సెస్ సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. సాయిధ‌ర‌మ్‌గారికి మ‌ళ్లీ సుప్రీమ్ డేస్ వ‌స్తాయ‌నే గ‌ట్టిగా న‌మ్ముతున్నాం“ అన్నారు

 

ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ – “మీడియాకు థాంక్స్‌. అడ‌గ్గానే టీజ‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వీన్‌, ర‌వి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. అలాగే న‌న్ను స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సంతోషంగా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

 

 

హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ – “కిషోర్‌గారు స్క్రిప్ట్ చెప్పిన‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. ఆయ‌న హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ను బ్యూటీఫుల్‌గా నెరేట్ చేశారు. సాయిధ‌రమ్ వండ‌ర్‌ఫుల్ కోస్టార్‌. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల‌వుతుంది. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంగా ఉన్నాం“ అన్నారు.

 

సునీల్ మాట్లాడుతూ – “నేను భీమ‌వ‌రంలో చ‌దువుకుంటున్న రోజుల్లో మేమెప్పుడైనా వైన్ షాప్‌కెళ్లి కూర్చుంటే .. నేను ఎలా బిహేవ్ చేసేవాడినో.. అలాంటి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. నేను మంచి క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో ఈ సినిమా ద్వారా ఓ మంచి క్యారెక్ట‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది. సినిమాతో పాటు వ‌చ్చే ట్రావెల్‌లోనే కామెడీ ఉంటుంది. క‌థ‌ను న‌మ్మి మైత్రీ సంస్థ‌లో సాయికి ఓ డిఫ‌రెంట్‌, మంచి సినిమా చేస్తున్నందుకు థాంక్స్‌. ఈ వేస‌విలో సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కుడు హ్యాపీగా న‌వ్వుకుంటూ మంచి ఫీల్‌తో ఇంటికెళ‌తారు. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. కొత్త క‌థ‌. ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

 

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ మాట్లాడుతూ – “అడ‌గ్గానే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకుని, వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్‌. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతంతో పాటు. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. నాలుగు పాటలు చాలా ఉన్నాయి. మంచి సినిమా చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వ‌న్‌గారికి, ర‌విగారికి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. చాలా స‌పోర్ట్ చేస్తూ,.. ఎక్క‌డా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌గారు క‌థ‌ను ఎంత బాగా చెప్పారో… అంత కంటే బాగా సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా చాలా బాగా న‌చ్చింది. కార్తీక్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నువ్వు నేను సినిమా చేస్తున్న స‌మయంలో సునీల్ అన్న కామెడీ టైమింగ్‌.. కామిక్ సెన్స్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని. న‌టుడిగా మారిన త‌ర్వాత ఆయ‌న‌తో ఓ సినిమా అయినా చేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాలో ఆయ‌న క‌లిసి ప‌నిచేశాను.. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేశాను“ అన్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

 

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2F86FUy

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...