Skip to main content

`మౌన‌మే ఇష్టం` ప్రెస్ మీట్‌

MOUNAME ISTAM PRESS MEETఆర్ట్ డైరెక్టర్ గా  దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న  ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకే మూవీస్ ప‌తాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం “మౌన‌మే ఇష్టం“. రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ ,రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ  చిత్రానికి వివేక్ మహదేవా సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్ తో ట్రేడింగ్ లో ఉంది. మార్చి 15 న ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.

హీరో సాయి కార్తీక్ మాట్లాడుతూ    –    ” ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అశోక్ కుమార్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రతి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఎంటో అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. నాకుఇలాంటి ఒక మంచి ప్రాజెక్టు లో అవకాశం ఇచ్చినందుకు అశోక్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. అలాగే రామ్ తులసి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సురేష్ గారు మంచి డైలాగ్స్ అందించారు. వివేక్ గారు ఇచ్చినా సంగీతాన్ని ఇప్పటికే ప్రతి ఒక్కరు అభినందించారు. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి . ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి”అన్నారు.

 

హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ – దర్శకుడు అశోక్ గారు ఈ సినిమాను వండర్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.రామ్ తులసి గారు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా తప్పుకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తిక్ కి ఈ సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది”అన్నారు.

 

డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ – “మంచి స్టోరీ దొరికితే దర్శకత్వం వహిద్దామని నేను దాదాపు 15 సంవత్సరాలుగా  ఆలోచిస్తూనే ఉన్నాను.  ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యూట్ జెండర్  లవ్ స్టొరీ. ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయంట్. ప్రతీ లెక్క టెక్నిషియన్ అద్భుతమైన పని తనం కనబరిచారు. సినిమా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది.చాలా ఆడిషన్స్ చేసి కార్తీక్ ని హీరో గా తీసుకోవడం జరిగింది. పార్వతీ మంచి పెరఫార్మర్. రీతూ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.సినిమా మార్చ్ 15 న విడుదలవుతుంది తప్పకుండా అందరూ చూడండి”అన్నారు.

 

కథా రచయిత సురేష్ మాట్లాడుతూ – “ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకుంటే వారు విడిపోవాల్సిన సందర్భం ఏర్పడితే వారి పరిస్థితి ఏంటి అనే అద్భుతమైన కథాంశం తో ఈ సినిమా రూపొందింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి నా ధన్యవాదాలు”అన్నారు.

నటి ప్రియాంక మాట్లాడుతూ – ” నటనలో ఎలాంటిఅనుభవం లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా తప్పక చూడండి” అన్నారు.

 

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ – “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’అన్నారు.

 

సినిమాటోగ్రాఫర్ రామ్ తులసి మాట్లాడుతూ – ” అశోక్ గారు నాకు చాలా చక్కటి సహకారాన్ని అందించారు . ప్రతి ఆర్టిస్ట్ చాలా అనుభవం ఉన్న నటుడిలా నటించారు. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది”అన్నారు.

 

ఈచిత్రానికి క‌థః సురేష్ గ‌డిప‌ర్తి, ఎడిట‌ర్ః మార్తాండ్ కే వెంక‌టేష్‌, కెమెరాఃజె.డి.రామ్ తుల‌సి, సంగీతంః వివేక్ మ‌హాదేవా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ః  రాజీవ్ నాయ‌ర్‌, నిర్మాతః ఆశ అశోక్‌, స్కీన్ ప్లే, ద‌ర్శ‌కత్వంః అశోక్ కోరాల‌త్‌.

 

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TEmxX9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...