Skip to main content

క‌శ్మీర్ పండిట్ స‌మ‌స్య‌ల‌తో ‘ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్‌’

Operation Gold Fish Teaser Launchవినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత విజ‌యాల త‌ర్వాత  అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌  చిత్రం ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్.  ఆదిసాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిభా అడివి, క‌ట్టా ఆశిష్‌రెడ్డి, కేశ‌వ్ ఉమా స్వ‌రూప్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డి, గ్యారీ బీహెచ్‌, స‌తీష్ డేగ‌ల‌తో పాటు న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను మ‌హేష్‌బాబు విడుద‌ల‌ చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం  ప్రసాద్  ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన  సమావేశం లో  ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ మాట్లాడుతూ ‘ క్రాస్ జోన‌ర్‌లో యాక్ష‌న్, రొమాంటిక్ కామెడీ అంశాల‌ను మేళ‌వించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.  భార‌తీయ తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ క‌థ‌ను ట‌చ్ చేయ‌లేదు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. ఎన్ ఎస్‌జీ క‌మాండో పాత్ర‌కు ఆదిసాయికుమార్‌ను అనుకున్న‌ప్పుడు ఆ  పాత్ర‌కు డ్యాన్సులు ఉండ‌వు కాబ‌ట్టి అత‌డు చేస్తాడో లేదో అని కంగారుప‌డ్డాను. క‌థ విని న‌టుడిగా నాకు చాలా కొత్త‌గా ఉంటుంద‌ని వెంట‌నే అంగీక‌రించారు. ఈ చిత్ర నిర్మాణంలో ప‌ద్మ‌నాభ‌రెడ్డి, సురేష్ అద్భుత‌మైన స‌హ‌కారాన్ని అందించారు అని తెలిపారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ  ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ టైటిల్ చెప్ప‌గానే ఆస‌క్తిక‌రంగా అనిపించింది. కానీ ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లు చేసిన నాకు ఎన్ ఎస్‌జీ క‌మాండో లుక్ సెట్ అవుతుందో లేదో అనిపించింది. నాన్న ఈ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేశారు. ఆయ‌న క‌థ విని నాకు ఈ పాత్ర బాగుంటుంద‌ని చెప్పారు. లుక్ టెస్ట్ చేయ‌గానే ధైర్యం వ‌చ్చింది. ఈ పాత్ర నాకు స‌రిపోతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నా పాత్ర‌కు హీరోయిన్‌, పాట‌లు ఏవీ ఉండ‌వు. క‌శ్మీర్ పండిట్‌ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా క‌నిపిస్తాను. య‌థార్థ అంశాల స్ఫూర్తితో నిజాయితీగా ఈ సినిమా చేశాం. న‌వ్య‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన చిత్రాల్ని ప్రేక్ష‌కులు విజ‌య‌వంతం చేస్తున్నారు. మా సినిమాను ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది.  1980 నాటి కాలంలో క‌శ్మీర్ పండిట్ కుటుంబాల‌కు జ‌రిగిన అన్యాయాన్ని చ‌ర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవ‌ల అలాంటి ఘ‌ట‌న‌లే మ‌ళ్లీ క‌శ్మీర్‌లో జ‌ర‌గ‌డం బాధ‌ను క‌లిగించింది అని అన్నారు

నిత్యాన‌రేష్ మాట్లాడుతూ చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. యాక్ష‌న్‌, స‌స్పెన్స్‌, రొమాంటిక్ కామెడీ హంగుల‌తో రెండు క‌థ‌లను జోడించి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. మా నాన్న‌గారు ఆర్మీలో ప‌నిచేశారు. అందుకే నా హృద‌యానికి ఈ చిత్రం చాలా ద‌గ్గ‌రైంది. కేరింత సినిమాతో ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ న‌న్ను చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాలో నా కోసం ఆయ‌న మంచి పాత్ర‌ను సృష్టించారు అని తెలిపింది

కార్తిక్‌రాజు మాట్లాడుతూ టీమ్ ఎఫెర్ట్‌కు నిద‌ర్శ‌న‌మిది. సాయికిర‌ణ్‌ను ప‌నిరాక్ష‌సుడు అంటారు. రోజుల‌కు 22 గంట‌లు ఈ సినిమా కోసం ప‌నిచేశారు. ప్రాణంపెట్టి సినిమా చేశారు. ఈ సినిమాతో కొత్త ఆదిసాయికుమార్‌ను చూస్తారు. ల‌వ్‌లీ స్టార్‌ను యాక్ష‌న్ స్టార్‌గా ఈ సినిమా ఆవిష్క‌రిస్తుంది. పార్వ‌తీశం మాట్లాడుతూ సాయికిర‌ణ్ అడ‌వి ఏ సినిమా చేసినా నాకో మంచి పాత్ర‌ను ఇస్తుంటారు. చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం అని తెలిపారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ ప‌దిమందితో క‌లిసి బ‌త‌క‌డం నాకు ఇష్టం. అలాంటి ల‌క్ష‌ణాలున్న మ‌నిషి అడివి సాయికిర‌ణ్‌. కెమెరామెన్ జైపాల్‌రెడ్డి ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. నిర్మాత‌ను కూడా సాంకేతిక నిపుణుడిగా భావించి ఈసినిమా చేశారు. వంద‌శాతం విజ‌యాన్ని సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది.

సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. నాలుగు పాట‌లుంటాయి. క్ష‌ణం, గ‌రుడ‌వేగ‌, గూఢ‌చారి త‌ర్వాత నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని తెలిపారు.

అబ్బూరి ర‌వి మాట్లాడుతూ…  ద‌ర్శ‌కుడిగా సాయికిర‌ణ్ త‌న పంథాను మార్చి చేస్తున్న సినిమా ఇది. అత‌డి గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. క‌థ విని నోట మాట రాలేదు. సాయి ఇలాంటి సినిమా చేస్తాడ‌ని ఊహించ‌లేదు. సాయికిర‌ణ్ డ‌బ్బు సంపాదించ‌క‌పోవ‌చ్చు కానీ మంచి మ‌నుషుల్ని సంపాదించుకున్నాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన క‌శ్మీర్ పండిట్ కుటుంబాల్ని క‌లుసుకొని వారి బాధ‌ల‌ను స్వ‌యంగా తెలుసుకొని సాయికిర‌ణ్ ఈ క‌థ‌ను రాసుకున్నారు. అలాగే  ఈ సినిమా కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న వారంద‌రిని క‌లుసుకున్నారు. పండిట్ కుటుంబాలు ప‌డే బాధ‌ల్ని వారి భావోద్వేగాల్ని ఈ సినిమాలో స‌హ‌జంగా చూపించారు. న‌టించ‌డం నాకు  రాదు. క‌ష్ట‌ప‌డి న‌న్ను భ‌రిస్తూ ఈ సినిమా చేయించుకున్నారు అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో గ్యారీ బీహెచ్, సురేష్‌, రామ‌కృష్ణ‌, జైపాల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మనోజ్‌ నందం, రావు రమేష్‌, అనీష్‌ కురువిల్లా, కృష్ణుడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి, ఆర్ట్‌: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కీర్తి సిరికొండ, యాక్షన్‌: రామకృష్ణ, సుబ్బు, నభా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పబ్లిసిటీ డిజైనర్‌: అనిల్‌ భాను, కో.ప్రొడ్యూసర్‌: దాయోధర్‌ యాదవ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌రెడ్డి తుమ్మ, పి.ఆర్‌.ఓ: నాయుడు-ఫణి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ITcPvJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...