Skip to main content

హీరో కాదు.. ఆ రోల్ క‌నిపించింది!! ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంసను మ‌ర్చిపోలేను! – హీరో రామ్ కార్తీక్

raghavendra rao praise to hero karthikద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అంత‌టి దిగ్గ‌జం నా సినిమా వీక్షించి చ‌క్క‌ని ఎమోష‌న్స్ పండించావ‌ని కితాబిచ్చారు. ఆ అరుదైన ప్ర‌శంస‌ నాలో ఎంతో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు యువ‌హీరో రామ్ కార్తీక్.  ఈ యంగ్ హీరో న‌టించిన రెండు సినిమాలు వేర్ ఈజ్ వెంక‌ట ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం .. ఒకేసారి థియేట‌ర్ల‌లోకి రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాల్లో త‌న న‌ట‌న‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు ద‌క్కాయ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. రెండూ ఒకేసారి రిలీజ‌వ్వ‌డం ఉల్లాసం నింపితే, అవి రెండూ చ‌క్క‌ని టాక్ తో విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో ర‌న్ అవ్వ‌డం బోన‌స్ అని అంటున్నారు కార్తీక్. ఇంకా ప్ర‌త్యేక‌ ఇంట‌ర్వ్యూలో ఈ యువ‌క‌థానాయ‌కుడు చెప్పిన సంగ‌తులివి.

 

* ఒకేసారి రెండు రిలీజ్ లు..  స్పంద‌న ఎలా ఉంది?

నేను న‌టించిన వేర్ ఈజ్ వెంక‌ట‌ల‌క్ష్మి, మౌన‌మే ఇష్టం ఒకేసారి రిలీజ‌య్యాయి. ఇది అరుదైన స‌న్నివేశం. ప్రేక్ష‌కుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ఎమోష‌న్ సీన్స్ కి ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

వెంక‌ట ల‌క్ష్మి రెస్పాన్స్?

ఎమోష‌న్స్ కి.. భ‌య‌పెట్టే స‌న్నివేశాల‌కు జ‌నం బాగా క‌నెక్ట‌వుతున్నారు. నా పాత్ర‌కు స్పంద‌న బావుంది. రాయ్ ల‌క్ష్మీని త‌ప్ప ఆ పాత్ర‌లో వేరొక‌రిని ఊహించుకోలేరు అన్నంత‌గా త‌ను న‌టించారు.

 

`మౌనమే ఇష్టం` రెస్పాన్స్?

ఆ సినిమా ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఈ సినిమాలో నా రోల్ యువ‌త‌రం అంద‌రికీ బాగా క‌నెక్ట‌వుతోంది. బాగా న‌టించాన‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. నిజాయితీ ఉన్న ప్రేమ‌క‌థ ఇది. సీనియ‌ర్ క‌ళాద‌ర్శ‌కులు అశోక్ గారు అద్భుతంగా తెర‌కెక్కించారు. స‌హ‌జ‌సిద్ధంగా చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ కోణంలో తెర‌కెక్కించారు. ఆయ‌న‌కు నా సిన్సియ‌ర్ థాంక్స్.

 

కాంప్లిమెంట్స్?

`మౌన‌మే ఇష్టం` సినిమా చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గారు .. ఆన్ స్క్రీన్ చాలా ఎత్తుగా క‌నిపిస్తున్నావ్.. న‌ట‌న స‌హ‌జంగా ఉంది .. ఎమోష‌న్ పండించావ్.. బాగా న‌టించావ్‌.. అని ప్ర‌శంసించారు.“హీరో కాదు.. ఆ రోల్ క‌నిపించింది!!“ అని అంత పెద్ద ద‌ర్శ‌కుడి ప్ర‌శంస ద‌క్క‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది. నాలో కాన్ఫిడెన్స్ మ‌రింత పెరిగింది.

 

* థియేట‌ర్లు విజిట్ చేశారా?

ప్ర‌సాద్ మ‌ల్టీప్టెక్స్ తో పాటు మాస్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ స్పంద‌న చూశాను. ది బెస్ట్ రెస్పాన్స్ ద‌క్కింది.

 

* భ‌విష్య‌త్ ప్రాజెక్టులు?

తెలుగు, త‌మిళంలో అవ‌కాశాలొస్తున్నాయి. ప్రస్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

 

* భ‌విష్య‌త్ ప్లానింగ్?

నా గ‌త చిత్రాలు మామ చంద‌మామ‌, మంచు కురిసే వేళ‌లో సినిమాల్లో నా న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. తాజాగా రిలీజైన రెండు చిత్రాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇక‌పైనా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించాల‌నుంది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లు అంటే ఇష్టం. ప్రేక్ష‌కులు మెచ్చే కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటాను. ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లే కాదు.. కొంచెం ర‌గ్గ్ డ్ గా ఉండే మాస్ పాత్ర‌లు చేయాల‌నుంది.

 

*స్వ‌స్థ‌లం.. స్వ‌గ‌తం?

పుట్టి పెరిగింది హైద‌రాబాద్ లో. అయితే మా కుటుంబానికి విజ‌య‌న‌గ‌రం- వైజాగ్ క‌నెక్ష‌న్ ఉంది. నాన్న‌గారు స్థిరాస్తి రంగంలో ఉన్నారు.

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FcIx1Q

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...