Skip to main content

‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి…’ అంటోన్న సిద్ధార్థ్!

Siddharth sings 'Excuse Me Rakshasi' for Sundeep Kishanతెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ పేరు చెబితే… ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలు గుర్తొస్తాయి. సిద్ధార్థ్ నటుడిగా మాత్రమే కాదు… గాయకుడిగానూ తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘బొమ్మరిల్లు’లో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో…’, ‘ఓయ్’ సినిమాలో ‘176 బీచ్ హౌస్ లో ప్రేమదేవత’, ‘ఆట’ సినిమాలో ‘నిన్ను చూస్తుంటే’ పాటలను పాడింది సిద్ధార్థే. చాలా రోజుల తరవాత ఈ హీరో మరో తెలుగు పాట పాడారు. ఆయన కోసం కాదు. సందీప్ కిషన్ కోసం!

 

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి …’ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.

 

ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ “తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది. న‌టుడిగా నాకు గుర్తింపు, గౌర‌వం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమాయే. తెలుగు ప‌రిశ్ర‌మ‌ అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా… నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను” అన్నారు.

 

సందీప్ కిషన్ మాట్లాడుతూ “నాకు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నా తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలో తను ఏదో రకంగా అసోసియేట్ అయితే బావుంటుందని అనిపించింది. అలాగే, సిద్ధార్థ్ వాయిస్ కి, తను పాడిన పాటలకు నేను పెద్ద అభిమానిని. ‘అప్పుడో ఇప్పుడో..’ పాటకు, ‘176 బీచ్ హౌస్ లో పాటకు నేను పెద్ద అభిమానిని. నిర్మాతగా నా మొదటి సినిమాలో సిద్ధార్థ్ గొంతులో నా పాట రావడం అనేది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్. నటుడిగా నాకు మొదటి నుంచి ఎవరెవరు అయితే అండగా నిలిచారో.. వారందరూ ఏదో రకంగా చిన్న భాగంగా అయినా ఉండాలని కోరుకున్నాను. అది ఇలా అయినందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

 

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ “సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా ‘లవ్ ఫెయిల్యూర్’కి… సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నేను సంగీత దర్శకుడు కావడం యాదృచ్చికమే. నాకు ఇది సంతోషంగా ఉంది. ఇద్దరూ నాకు మంచి స్నేహితులు” అన్నారు.

పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ “ఈ లిరిక్స్ రాసేటప్పుడు ఈ పాట సిద్ధార్థ్ గారు పాడితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచిస్తూ, ఆయన్ను మనసులో పెట్టుకుని రాశాడు. ఏయే తెలుగు పదాలు ఆయన వాయిస్ లో బావుంటాయని ఆలోచించి రాశా. ఇప్పటివరకూ సిద్ధార్థ్ పాడిన ప్రతి తెలుగు పాట బ్లాక్ బస్టర్. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

 

పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు – ఫణి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.

 

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EYlxVG

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...