
మా ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ నరేష్ ప్యానల్ పోటీ పడ్డాయి , అయితే శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యమే ! దాంతో నరేష్ మహేష్ బాబు మద్దతు కూడగట్టడం కోసం ప్రయత్నం చేసాడు . మహేష్ బాబు కూడా నరేష్ కు మద్దతు ప్రకటించాడు . అయితే ఎన్నికలు దగ్గర పడిన సమయంలో శివాజీరాజా ప్యానల్ పై నరేష్ ప్యానల్ విరుచుకుపడడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దాంతో మా ఎన్నికలు రచ్చ రచ్చ అయ్యాయి . ఇంకేముంది ఈ వ్యవహారం అంతా నచ్చని మహేష్ బాబు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు . మహేష్ వచ్చి ఓటు వేస్తాడు గెలిపిస్తాడు అని ఆశించిన నరేష్ కు భంగపాటు తప్పలేదు . అయితే మహేష్ బాబు ఓటు వేయకపోయినప్పటికీ నరేష్ గెలవడం విశేషం .
English Title : Mahesh unhappy with MAA elections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XSg36f







Comments
Post a Comment