
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ భయపడుతున్నాడని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కూడా కథనాలు వినిపిస్తున్నాయి . రాజకీయాల్లోకి వచ్చాకా భయపడుతూ పొతే పార్టీ పెట్టడం ఎందుకు ? అని ప్రశ్నిస్తున్నారు . అయితే రాజకీయాల్లోకి రజనీకాంత్ వస్తున్నట్లుగా 20 ఏళ్లుగా ప్రచారం సాగుతూనే ఉంది కానీ అది ఎప్పటికప్పుడు వాయిదాపడుతూనే ఉంది . అయితే 2017 లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు కానీ తీరా ఎన్నికల సమయం రాగానే అసెంబ్లీ ఎన్నికలే మనకు గీటురాయి అంటూ అందరి ఆశలపై నీళ్లు చల్లాడు రజనీకాంత్ .
English Title : Rajinikanth fans upset in election time
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2u0UrXz







Comments
Post a Comment