Skip to main content

‘కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌’ ప్రారంభం

kousalya krishnamurthy cricketer movie openingనటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి..క్రికెటర్‌’. ఈ చిత్రం ప్రారంభోత్సవం మార్చి 13న రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నివాస గృహంలో ప్రారంభమైంది. హీరో కార్తీక్‌రాజు, హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌నివ్వగా, ఈస్ట్‌ గోదావరి డిిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇదే రోజు నుంచి రాజమండ్రి పరిసరాల్లో కంటిన్యూగా షూటింగ్‌ జరుగుతుంది.

 

ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”సూపర్‌గుడ్‌, ఎడిటర్‌ మోహన్‌ వంటి బేనర్స్‌లో సినిమాలు చేశాను. అయితే ఎప్పటినుంచో కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో సినిమా చెయ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరుతోంది. తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది” అన్నారు.

 

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ”విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఐశ్వర్య ఒక టీజర్‌ చూపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్రికెటర్‌గా బౌలింగ్‌, బ్యాటింగ్‌ అద్భుతంగా చేసింది. తర్వాత ఆ కథ చెప్పి, ఆ రైట్స్‌ కొనిపించి తెలుగులో నన్నే తియ్యమని చెప్పింది. అలా ఈ సినిమా మొదలవడానికి ఐశ్వర్యా రాజేషే కారణం. తను ఆల్రెడీ తమిళ్‌, మలయాళంలో సినిమాలు చేసినా ఫిమేల్‌ క్రికెటర్‌గా మెయిన్‌ రోల్‌తో తెలుగులో ఎంటర్‌ అవుతోంది. అలాగే మా వైజాగ్‌ రాజుగారి అబ్బాయి కార్తీక్‌ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్‌ అవుతుంది. వెన్నెల కిషోర్‌ ఎస్‌.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండే క్యారెక్టర్‌ చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది” అన్నారు.

 

హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ ”మణిరత్నంగారి ‘నవాబ్‌’ సినిమా ద్వారా నేను తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైనప్పటికీ డైరెక్ట్‌గా తెలుగులో కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. తమిళ్‌లో ఈ సినిమా చేసేటపుడు ఆరు నెలలపాటు క్రికెట్‌ నేర్చుకొని ఈ క్యారెక్టర్‌ చేశాను. నాకు మంచి పేరు తెచ్చిందా సినిమా. ఆ సినిమా టీజర్‌ చూపించగానే కె.ఎస్‌.రామారావుగారు ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. కథ అడిగి తెలుసుకున్నారు. తెలుగులో చేస్తే బాగుంటుంది అనగానే వెంటనే ఓకే చెప్పారు. 20 రోజుల్లో షూటింగ్‌ స్టార్ట్‌ అయిపోయింది. తెలుగులో కూడా ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది. మా తాత అమర్‌నాథ్‌గారు ఒకప్పటి హీరో, మా అత్తయ్య శ్రీలక్ష్మిగారు హాస్యనటిగా అందరికీ తెలుసు. మా నాన్న రాజేష్‌గారు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. మా ఫ్యామిలీలో అందర్నీ ఆదరించిన ప్రేక్షకులు నన్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

 

హీరో కార్తీక్‌రాజు మాట్లాడుతూ ”ఇంతకుముందు నేను రెండు, మూడు సినిమాలు చేశాను. అయితే కె.ఎస్‌.రామారావు అంకుల్‌ బేనర్‌లో చాలా మంచి హీరో క్యారెక్టర్‌ ఇచ్చారు. ఈ క్యారెక్టర్‌ నాకు హీరోగా మంచి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

 

వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ ”ఈ సినిమా కథ చాలా బాగుంది. ఇందులో నాది మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యారెక్టర్‌. ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది” అన్నారు.

 

రచయిత హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ ”భీమనేనిగారు చేసిన సుడిగాడు సినిమాకి వర్క్‌ చేశాను. కెజిఎఫ్‌ చిత్రం తర్వాత తెలుగులో ఈ సినిమాతో మరో మంచి అవకాశం వచ్చింది. కె.ఎస్‌.రామారావుగారి ఆఫీస్‌కి వెళ్తేనే గొప్ప అనుకునే నాకు వారి బేనర్‌లో సినిమాకి రాసే అవకాశం రావడం చాలా థ్రిల్‌గా ఫీల్‌ అవుతున్నాను” అన్నారు.

 

సినిమాటోగ్రాఫర్‌ ఐ.ఆండ్రూబాబు మాట్లాడుతూ ”కె.ఎస్‌.రామారావుగారి బేనర్‌లో చాలా మంచి సినిమాలు చేశాను. మళ్ళీ ఈ బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఇది మంచి సినిమా అవుతుంది” అన్నారు.

 

డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌రాజు, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, రంగస్థలం మహేష్‌, విష్ణు(టాక్సీవాలా), శశాంక్‌, రవిప్రకాష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూబాబు, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, గౌరవ రచన పర్యవేక్షణ: సాయిమాధవ్‌ బుర్రా, మాటలు: హనుమాన్‌ చౌదరి, సంగీతం: ధిబు నినన్‌ థామస్‌, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

 

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O0XYyl

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...