
శ్రీకృష్ణుడిగా ఒకరు కాదు ఇద్దరినీ అనుకుంటున్నాడు జక్కన్న . ఒకరేమో జూనియర్ ఎన్టీఆర్ కాగా మరొకరు అమీర్ ఖాన్ . అప్పటి పరిస్థితులను బట్టి ఈ ఇద్దరిలో ఒకరిని శ్రీకృష్ణుడిగా ఎంపిక చేయనున్నాడు జక్కన్న . అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడిగా సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నాడు ఒకవేళ అమీర్ ఖాన్ డేట్స్ కానీ ఇతరత్రా ఏదైనా సమస్య వస్తే జూనియర్ ఎన్టీఆర్ ని శ్రీకృష్ణుడిగా ఎంపిక చేయనున్నాడు . అమీర్ ఖాన్ సెట్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని కర్ణుడిగా చూపించాలని భావిస్తున్నాడట జక్కన్న . జూనియర్ ఎన్టీఆర్ కర్ణుడిగా , శ్రీకృష్ణుడిగా , అర్జునుడిగా , దుర్యోధనుడిగా ఇలా ఏ పాత్రకి తీసుకున్నా సరిపోతాడు కానీ దుర్యోధనుడు అనగానే కాస్త హైట్ ఉండాలి కాబట్టి రానా ని దుర్యోధనుడిగా ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది . అలాగే భీష్ముడిగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ ని ఎంపిక చేయనున్నాడని తెలుస్తోంది . మొత్తానికి జక్కన్న ఏం చేసిన భారీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు .
English Title : Who is sri krishna in Mahabharatham Jr. ntr or Aamir khan ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ub3cP1







Comments
Post a Comment