Skip to main content

అంత‌ర్జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్‌…. జెడి.రామ‌తుల‌సి ఇంట‌ర్వ్యూ

cinematographer jd rama thulasi interviewబెలూన్ రంగును బ‌ట్టి కాదు లోప‌లున్న గ్యాస్‌ను బ‌ట్టి ఎగురుతుంది అనే సిద్దాంతాన్ని కెమెరామెన్ రామ‌తుల‌సి బాగా వంట‌బ‌ట్టించుకున్నారు. వాడేది ఏ కెమెరా అయినా క్రియేటివిటీ వుంటే  అద్భుతాలు స్రుష్టించ‌చ్చు అని నిరూపించారు.

 

ఆయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించిన ర‌క్తం చిత్రానికి అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. ఒక తెలుగు సినిమా కు అంత‌ర్జాతీయ  సినిమాటోగ్ర‌ఫీ అవార్డు రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. ప్ర‌స్తుతం ఆయ‌న `మౌన‌మే ఇష్టం` అనే చిత్రానికి సినిమాటో గ్ర‌ఫీ అందించారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా పాత్రికేయుల‌తో ఆయ‌న మాట్లాడుతూ ..

 

నేప‌థ్యం..

– నేను తెలుగువాడినే అయినా.. మా పూర్వీకులు త‌మిళ‌నాడుకి వ‌ల‌స వెళ్లిపోవ‌డంతో అక్క‌డే పుట్టి పెరిగాను. త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజ‌పాళెం అనే ఊర్లో పుట్టాను. ఎన్‌.కె.ఏకాంబ‌రంగారి వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేశాను. అయితే షాజీ కైలాస్ న‌న్ను కెమెరామెన్‌గా ప‌రిచ‌యం చేశారు.

 

తెలుగుకే ఎక్కువ ప్రాధాన్య‌త‌….

– `మౌన‌మే ఇష్టం` ఈ నెల 15న విడుద‌ల కానుంది. అలెక్సా కెమెరాను ఉప‌యోగించి ద‌ర్శ‌కుడి అభిరుచికి అనుగుణంగా ప్ర‌తి ప్రేమును పెయింటింగ్ లాగా తెర‌కెక్కించాం. అశోక్ కుమార్ కొర‌ల‌త్ ఫేమ‌స్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌…. ప్ర‌తి ఫ్రేమూ త‌న ఆర్ట్ వ‌ర్క్ లాగే వుండాల‌నుకుంటారు. లైటింగ్ లాంటి విష‌యాల్లో న‌న్ను బాగా ఎంక‌రేజ్ చేసి సినిమా బాగా రావ‌డానికి కృషి చేశారు. ఆయ‌న ప‌ట్టుద‌ల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. నేను చెన్నైలో వున్నా  తెలుగు సినిమాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నాను.

 

ఆయ‌న‌తో మంచి అనుబంధం…

– రాజేష్ ట‌చ్ రివ‌ర్‌గారు మంచి టెక్నీషియ‌న్‌. నా బంగారు త‌ల్లి స‌మ‌యంలో ఆయ‌న‌తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

 

మ‌రో అడుగు ముందుకు…

– సినిమాటోగ్రాఫ‌ర్‌గా నాకు `మౌన‌మే ఇష్టం ` 7వ సినిమా. `నా బంగారు త‌ల్లి` చిత్రం ద్వారా నేను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యాను.  రాజేష్ ట‌చ్‌రివ‌ర్ రూపొందించిన ఆ చిత్రం ద్వారా నాకు ఎన్నో ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే ర‌క్తం చిత్రానికి సినిమాటో గ్రాఫ‌ర్ గా ప‌నిచేశాను. `ర‌క్తం` చిత్రానికి గానూ,Indie” Gathering Film Festival in Ohio.లో  బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ గా అంత‌ర్జాతీయ అవార్డు ద‌క్కింది.

 

త‌దుప‌రి ప్రాజెక్ట్స్‌…

ప్ర‌స్తుతం తెలుగు, ఒడియా భాష‌ల్లో `ప‌ట్న‌ఘ‌డ్`  అనే చిత్రం జ‌రుగుతోంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో ఆ చిత్రం కూడా వండ‌ర్ క్రియేట్ చేయ‌బోతోంది. `ప‌ట్న‌ఘ‌డ్` చిత్రానికి కూడా రాజేష్ ట‌చ్‌రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక మౌన‌మే ఇష్టం సినిమా విషయానికి వ‌స్తే.. అశోక్ కుమార్ కొర‌ల‌త్ ఫేమ‌స్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌…. ప్ర‌తి ఫ్రేమూ త‌న ఆర్ట్ వ‌ర్క్ లాగే వుండాల‌నుకుంటారు. లైటింగ్ లాంటి విష‌యాల్లో న‌న్ను బాగా ఎంక‌రేజ్ చేసి సినిమా బాగా రావ‌డానికి కృషి చేశారు. ఆయ‌న ప‌ట్టుద‌ల చూసేకొద్దీ మాలో ఉత్సాహం పెరిగేది. ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిలా నిలుస్తుంది. నేను చెన్నైలో వున్నా  తెలుగు సినిమాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నాను.

 

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NYQXy5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...