
హీరో, నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ – “మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన శర్వానంద్‌గారికి థాంక్స్. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌కు అంతకు మించిన రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న సమస్యను ఎంటర్‌టైనింగ్ వేలో దర్శకులు బసవ శంకర్‌గారు చక్కగా హ్యాండిల్ చేశారు. సినిమా ఆద్యంతం అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. మార్చి 22న సినిమాను విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం“ అన్నారు.
డైరెక్టర్ బసవ శంకర్ మాట్లాడుతూ – “ఎంటర్ టైనింగ్ మూవీ.. అందులో మేం చెప్పాలనుకున్న విషయాన్ని సునిశితంగా చెప్పాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాం. మా ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో శర్వానంద్‌గారికి థాంక్స్“ అన్నారు.
రాకేశ్ వర్రే, గార్గేయి యల్లాప్రగడ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శంకర్ శర్మ, సినిమాటోగ్రఫీ: విజయ్ జె.ఆనంద్, నిర్మాత: రాకేష్ వర్రే, దర్శకత్వం: బసవ శంకర్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FgnXin







Comments
Post a Comment