Skip to main content

మా అనుమతి లేకుండా గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ ఎలా ఏనౌన్స్ చేస్తుంది – హీరో, నిర్మాత మోహన కృష్ణ

mohan krishna fire on mythri movie makersనాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ….

 

“మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం.  అక్టోబర్ లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్  చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు.

 

కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్ ను ఎలా ఏనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక… 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

 

నటీనటులు –  సుమన్, నాగబాబు, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్, గీతా సింగ్, జబర్ దస్త్ అప్పారావు, రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను, నల్ల వేణు, ఆర్.పి, జబర్దస్త్ బాబి, వరహరిబాబు, లడ్డూ, బాలాజి, చత్రపతి శేఖర్ తదితరులు

 

టైటిల్ – గ్యాంగ్ లీడర్ (మళ్లీ మొదలవుతుంది రచ్చ)

నిర్మాత – శింగులూరి మోహన్ రావు

డైరెక్టర్ – సిహెచ్. రవి కిశోర్ బాబు

హీరో – బావ మరదలు ఫేమ్ మోహన్ కృష్ణ

మ్యూజిక్ డైరెక్టర్ – రమేష్ నాయుడు

ఎడిటిర్ – నందమూరి హరి

కెమెరామెన్ – మురళి

ఫైట్ మాస్టర్ – రామ్ సుంకర

డ్యాన్స్ మాస్టర్ – మహేష్

పిఆర్వో – లంకలపల్లి శ్రీనివాస్

పోస్ట్ ప్రొడక్షన్ – సారథి స్డూడియోస్

పబ్లిసిటీ డిజైనర్ – అజయ్

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HrZqbT

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...