Skip to main content

మ‌హాన‌టి ఫేమ్ బాల‌న‌టి సాయి తేజ‌స్విని ప్ర‌ధాన ప్రాత‌లో ప్రియ‌మ‌ణి “సిరివెన్నెల”‌

Mahanati fame sai tejaswini in lead role priyamani sirivennelaతెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ళ‌యాలీ భాష‌ల్లో త‌న‌దైన న‌ట‌న‌తో, విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన డ‌స్కీ బ్యూటీ ప్రియమణి.. ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును అందుకోవ‌డమే కాకుండా, క‌మ‌ర్శీయ‌ల్ హీరోయిన్ గా సైతం ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొందారు.

పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని… సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో ప్రియ‌మ‌ణి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉన్నారు. అలానే తాజాగా విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కి సోష‌ల్ మీడియాతో పాటు, సినీ అభిమానుల్లో సైతం విప‌రీత‌మైన, క్రేజ్ ఏర్ప‌డింది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాసిక్ టైటిల్ “సిరివెన్నెల” అనే పేరు పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు… జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న బాల‌న‌టి సాయి తేజస్విని కీల‌క పాత్ర పోషిస్తోంది. తాజాగా సాయి తేజ‌స్విని లుక్ ని విడుద‌ల చేశారు సిరివెన్నెల చిత్ర బృందం. వీరిద్ద‌రితో పాటు బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా

 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. తెలుగునాట రీఎంట్రీ ఇవ్వ‌డానికి ప్రియ‌మ‌ణి చాలా కాలంగా క‌థ‌లు విన్న‌ప్ప‌టికీ, మా సిరివెన్న‌ల క‌థ బాగా న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ లో న‌టించేందుకు ఒప్పుకున్నారు. ప్రియ‌మ‌ణి గ్లామ‌ర్, న‌ట‌న మా సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలుస్తాయ‌ని న‌మ్మ‌కం ఉంది.  ఇక ప్రియ‌మ‌ణితో పాటు మా సినిమాకు మ‌రో ఆక‌ర్ష‌ణ,  బాల‌న‌టి సాయి తేజ‌స్విని పాత్ర‌. ఇటీవ‌లే విడుద‌లైన మ‌హాన‌టి సినిమాతో పాపుల‌రైన సాయి తేజ‌స్విని ఆ త‌రువాత మా సినిమాలోనే న‌టిస్తుండ‌టం మాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. సాయి తేజస్విని పాత్ర చుట్టూనే సిరివెన్న‌లు రూపుదిద్దుకుంది. తాజాగా షూటింగ్ ముగించుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. అని అన్నారు.

 

నటీనటులు – ప్రియమణి, కాలకేయ ప్రభాకర్, సాయి తేజస్విని, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు

 

సాంకేతిక వర్గం

 

నిర్మాతలు – కమల్ బోరా, ఏ.ఎన్. భాషా, ఏ.రామసీతా

రచన, దర్శకత్వం – ప్రకాష్ పులిజాల

మ్యూజిక్ – ఏఎన్ బి కోర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ

సాంగ్స్ కంపోజింగ్ –  మంత్ర ఆనంద్, కమ్రాన్

డిఓపి – కళ్యాణ్ సమి

ఎడిటర్ – నాగేశ్వర్ రెడ్డి

లిరిక్స్ – శ్రీరామ్ తపశ్వీ

కొరియోగ్రాఫర్ – ఛార్లీ

ఫైట్స్ – రామకృష్ణ

ప్రొడక్షన్ కంట్రోలర్ – యోగానంద్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – మోహన్ పరుచూరి,

పీఆర్వో – ఏలూరు శ్రీను



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2HxencF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...