Skip to main content

వెంకీ మామకు ఎఫ్ 2 కు డిఫరెన్స్ అదే!

వెంకీ మామకు ఎఫ్ 2 కు డిఫరెన్స్ అదే!
వెంకీ మామకు ఎఫ్ 2 కు డిఫరెన్స్ అదే!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మామ అల్లుళ్లుగా నటించిన చిత్రం వెంకీ మామ. సురేష్ బాబు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెల్సిందే. గత కొంత కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే అంశంపై చాలానే ఆలోచించారట. ఈ చిత్రానికి వెంకటేష్, నాగ చైతన్య మార్కెట్ లకు మించిన బడ్జెట్ పెట్టేయడంతో దాన్ని రికవర్ చేయాలంటే మంచి రిలీజ్ డేట్ కచ్చితం. అందుకే సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య వచ్చే కంటే సోలో రిలీజ్ వైపు చూసుకుంటే బెస్ట్ అని సురేష్ బాబు ఫిక్స్ అయ్యి డిసెంబర్ రిలీజ్ ను కన్ఫర్మ్ చేసాడు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ వెంకటేష్ పుట్టినరోజు నాడు అంటే డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ 13 అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ నెమ్మదిగా సాగుతున్నాయి. వాటిని వేగవంతం చేయాలి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. రెండిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో మరింత అగ్రసివ్ గా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.

మరోవైపు వెంకీ మామ పూర్తి ఫన్ ఎంటర్టైనర్ అని, వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని. మరో ఎఫ్ 2 తరహా సినిమా ఇదని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో పూర్తిగా నిజం లేదని తెలుస్తోంది. వెంకీ మామలో అన్ని రకాల ఎమోషన్స్ కు సమ ప్రాధాన్యతను ఇచ్చినట్లు సమాచారం. కామెడీ ఎంత ఉంటుందో, ఎమోషనల్ కంటెంట్ కూడా అంతే ఉండేలా దర్శకుడు బాబీ, నిర్మాత సురేష్ బాబు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా, వెంకటేష్ రైతుగా కనిపిస్తారని తెలుస్తోంది. అటు నాగ చైతన్య, ఇటు వెంకటేష్ పాత్ర కూడా కామెడీ చేసి ఎంటర్టైన్ చేసి ఎమోషనల్ గా ఏడిపిస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర క్లయిమాక్స్ లో కన్నీరు తెప్పించే రేంజ్ లో ఉంటుందిట. వెంకటేష్ కు అసలే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ టైపు సినిమాలు వారిని బాగా అట్ట్రాక్ట్ చేస్తాయి కాబట్టి సినిమాకు విజయావకాశాల విషయంలో సురేష్ బాబు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ ఉంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకీ మామ టైటిల్ సాంగ్, రెట్రో ఫీల్ తో సాగే ఎన్నాళ్ళకో సాంగ్ రెండూ కూడా యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. మరి డిసెంబర్ 13న రానున్న వెంకీ మామ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/330wWwF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...