Skip to main content

ఇక్కడే సెటిలైపోవాలని నిర్ణయించుకున్న రాశి

ఇక్కడే సెటిలైపోవాలని నిర్ణయించుకున్న రాశి
ఇక్కడే సెటిలైపోవాలని నిర్ణయించుకున్న రాశి

ముద్దు గుమ్మ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. అది ఆమెకు డ్రీం డెబ్యూ అనే చెప్పాలి. ఒక బలమైన పాత్రతో, నటనకు అవకాశమున్న సినిమాలో ఆమె డెబ్యూ జరిగింది. ఆ సినిమా విజయవంతమైంది కూడా. అయితే తర్వాత రాశి ఖన్నా సినిమాల ఎంపికలో చేసిన పొరబాట్లు కావొచ్చు, మరింకేదైనా కావొచ్చు. ఆమె కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. విజయాల శాతం తక్కువుండడంతో ఆమె టయర్ 2 హీరోలకే పరిమితమైంది. ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో అవకాశమొచ్చినా అందులో ఈమెది చిన్న పాత్రే. పెద్దగా గుర్తింపు కూడా రాలేదు, సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. దాంతో కొన్నాళ్ళు రాశి ఖన్నా పూర్తిగా సైడ్ అయిపొయింది. చూస్తుంటే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మంచి అంచనాలు ఉన్న సినిమాల్లో నటిస్తోంది రాశి ఖన్నా. పైగా మధ్యలో వేరే భాషల వైపు చూసిన రాశి ఇక ఇక్కడే సెటిలైపోవాలని, టాప్ నటిగా టాలీవుడ్ లోనే రాణించాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే ముందుగా ఇక్కడ ఇల్లు తీసుకుని సెటిలైంది.

ఇటీవలే హైదరాబాద్ లో ఒక పోష్ ఇంటిని కొనుగోలు చేసింది రాశి. ఇన్నాళ్లూ హోటల్స్ లో ఉంటోన్న రాశి ఇక టాలీవుడ్ కే తన మకాం షిఫ్ట్ చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు తెలుగుపై పూర్తి పట్టు సాధించాలని ఫిక్స్ అయింది. రాశి ఖన్నా ముందు నుండే తెలుగులో చాలా బెటర్. కెరీర్ స్టార్టింగ్ లోనే ఒక పాట కూడా పాడింది రాశి. అయితే ఇప్పుడు తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయింది. టాప్ నటిగా రాణించాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదని ఫీల్ అవుతోంది.

ప్రస్తుతం రాశి క్రేజ్ ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. వెంకీ మామలో నాగ చైతన్య సరసన నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదలవుతోంది. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన ప్రతిరోజూ పండగేలో ఆడిపాడుతోంది. ఇందులో ఆమె సోలో హీరోయిన్. ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న విడుదలవుతోంది. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది రాశి. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వారం గ్యాప్ లో రెండు సినిమాలు, రెండు నెలలు గ్యాప్ లో మూడు సినిమాలు రాశి ఖన్నావి విడుదలవుతాయి. ఈ సినిమాల తర్వాత తన రేంజ్ మారుతుందని ఆశిస్తోంది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు బాగా కొరత ఉంది. స్టార్ హీరోలు కూడా అందుకే మిడ్ రేంజ్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. తనకన్నా లేట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక అప్పుడే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. దీంతో రాశి కూడా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది తన కెరీర్ టర్న్ అవుతుందని ఆశిస్తోంది రాశి ఖన్నా. మరి చూద్దాం రాశి అనుకున్నట్టు జరుగుతుందో లేదో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33mJpLE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...