Skip to main content

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట
మాస్ ఎంబీ ప్రతి సోమవారం రచ్చ చేస్తాడుట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలవుతోన్న విషయం తెల్సిందే. అయితే నెల క్రితం నుండి ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగా లేవని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ భీభత్సంగా జరుగుతుండడం, సరిలేరు నీకెవ్వరు నుండి ఏ అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన సమంజసమే అనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఒక్క టీజర్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ రచ్చ లేపింది. ఈ టీజర్ అప్లోడ్ అయ్యి 100 గంటలు దాటినా కూడా ఇంకా టాప్ లోనే ట్రెండ్ అవుతోంది. అప్పుడే 25 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. మరోవైపు అల వైకుంఠపురములో నుండి వచ్చిన మూడో పాట ఓ మై గాడ్ డాడీ అనుకున్నంత రెస్పాన్స్ రాబట్టకపోవడంతో తొలిసారి సరిలేరు నీకెవ్వరు పైచేయి సాధించినట్లైంది.

ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లు, వినూత్న పద్దతిలో ప్రమోషన్స్ చేయగలమన్న ఆశ ఉన్నవాళ్లు తమను సంప్రదించమని, తమతో కలిసి పనిచేసే అవకాశమిస్తామని చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు దానికి తగ్గట్లుగా వినూత్న పద్దతిలో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే అదిరిపోయే టీజర్ తో ప్రమోషన్స్ కు తెరలేపిన సరిలేరు నీకెవ్వరు బృందం ఇకపై ప్రతి సోమవారం ఏదొక అప్డేట్ తో రచ్చ లేపబోతోందిట. #MassMBMondays పేరుతో నిన్న ఒక హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి అప్డేట్ ఏంటో ఊహించండి అంటూ సరిలేరు నీకెవ్వరు బృందం ఫ్యాన్స్ ను ఊరించింది. హ్యాష్ ట్యాగ్ ను చూసిన ఎవరైనా ఇది కచ్చితంగా సరిలేరు గురించి అప్డేట్ విషయంలోనిదని, ఈ లెక్కన ప్రతి సోమవారం ఏదొక అప్డేట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు అని అర్ధం చేసుకోవచ్చు.

సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ మధ్య కాలంలో మొత్తం 6 సోమవారాలు ఉన్నాయి. అంటే ఈ 6 సోమవారాలు 6 అప్డేట్స్ ను ప్లాన్ చేశారన్నమాట. ఇందులో థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, సొంగ్స్ ఇవన్నీ ఉండనున్నాయి. మరి ఏ సోమవారం ఏ ప్రమోషనల్ అప్డేట్ ప్లాన్ చేసారో తెలీదు. ప్లాన్ మొత్తం ముందే ఇచ్చేస్తారా లేక ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇస్తారా అన్నది కూడా చూడాలి. మొత్తానికి ఏదైతేనేం, మహేష్ ఫ్యాన్స్ కరువు తీరి ప్రమోషన్స్ లో రచ్చ లేపుతోంది ఈ చిత్రం.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాణంలో దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ చిత్రం మహేష్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XUWWbZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...