స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్స్ గురించి ఇప్పటికే అందరూ కథలు కథలుగా మాట్లాడుకున్నారు. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సినిమా విడుదలకు నాలుగు నెలలు ముందు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టి చాలా అగ్రసివ్ గా ముందుకెళుతున్నారు అల వైకుంఠపురములో టీమ్. ఇప్పటికే రెండు పాటల్ని విడుదల చేసి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. సామజవరగమన పాట అయితే 90 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వైపు దూసుకుపోతోంది. లైక్స్ కూడా 1 మిలియన్ వచ్చేలా ఉన్నాయి. రెండో పాట రాములో రాముల కూడా అదే స్థాయిలో ఉండడంతో ఆ పాట కూడా శ్రోతలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 60 మిలియన్ వ్యూస్ దాటేసింది. త్వరలోనే మొదటిపాటను అందుకునేలా ఉంది. రెండు పాటలు అంత పెద్ద హిట్ అవ్వడంతో మూడో పాట విషయంలో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నిన్న సాయంత్రం మూడో పాటను కూడా విడుదల చేసారు.
ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే పాట, మొదటి రెండు పాటలంత రేంజ్ లో లేదు కానీ ఇది కూడా ట్రెండీగా ఇప్పటి యూత్ ను ఆకట్టుకునే రేంజ్ లోనే ఉంది. అయితే చిక్కల్లా ఈ పాట లిరికల్ వీడియోలో కాస్ట్ అండ్ క్రూ యొక్క ఫోటోలను పక్కనే వాళ్ళ నాన్నల ఫోటోలను ట్రిబ్యూట్ తరహాలో వేశారు. లిరిక్స్ సరదాగానే ఉన్నా నాన్నలకు ట్రిబ్యూట్ ఇస్తూ సరదా పేరుతో ఇలాంటి కించపరిచే లిరిక్స్ ఏంటనే వాదన మొదలైంది. ఈ పాట ఒక కొడుకు నాన్న పెట్టే టార్చర్ ను తట్టుకోలేక పాడిన పాటని ఇట్టే అర్ధమవుతుంది. నా విషయంలో అంత కఠినంగా ఉండకు, నా దృష్టిలో చెడ్డవాడివి అవ్వొద్దు అంటూ నాన్న పెట్టిన కష్టాలను గుర్తుచేసుకుంటూ సరదాగా సాగే ఈ పాట ఆఖర్లో.. మా అమ్మకు మొగుడు.. నాన్నయ్యాడు, మా అమ్మకు మొగుడు డమ్మీగాడు అంటూ లిరిక్స్ ఉంటాయి. సాధారణంగానైనా కూడా నాన్నని డమ్మీగాడు అనడమేంటి అనిపించినా ఏదో సరదాగా సాగే పాట కాబట్టి పట్టించుకోవనసవరం లేదు అనుకుందాం. కానీ ఈ పాట నాన్నలు అందరికీ ట్రిబ్యూట్ తరహాలో సాగుతుంది. పైగా ఈ పాటను స్వర్గీయ అల్లు రామలింగయ్యకు డేడికేట్ చేసారు. నాన్నను డమ్మీగాడు అంటూ సాగే పాటను నిర్మాత అల్లు అరవింద్ తన నాన్న అయిన అల్లు రామలింగయ్యకు ఎలా డేడికేట్ చేశారోనని ఇండస్ట్రీలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. దువ్వాడ జగన్నాథం తర్వాత బన్నీ, పూజ కలిసి నటిస్తోన్న చిత్రమిదే. ఇంకా ఈ చిత్రంలో నివేద పేతురాజ్, సుశాంత్, సునీల్, నవదీప్, టబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చినబాబు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KM174E
Comments
Post a Comment