ప్రస్తుతం విజయ్ దేవరకొండ కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. తన రీసెంట్ సినిమా డియర్ కామ్రేడ్ పై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి అన్నీ అడియాశలు అయ్యాయి. పైగా ఈ సినిమాతో ట్రోల్స్ ను కూడా ఎదుర్కొన్నాడు విజయ్. దాంతో ఇప్పుడు రాబోయే సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అలా అని చెప్పి విజయ్ దేవరకొండ చేతుల్లో సినిమాలు లేవని కాదు. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ తర్వాత పూరి జగన్నాథ్ తో ఫైటర్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పాడు.
ఇక పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేసే సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నత్తి పాత్రలో ఇరగదీసిన విషయం మనందరికీ తెల్సిందే. ఇదే తరహాలో నత్తి పాత్రలో విజయ్ దేవరకొండ నటన ఉంటుందని, ఇది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. నత్తి పాత్ర పెట్టి హీరో క్యారెక్టరైజేషన్ కు కొత్త యాంగిల్ తీసుకురానున్నాడు పూరి జగన్నాథ్.
ఇస్మార్ట్ శంకర్ తో ఇటీవలే బ్యాక్ టు ఫామ్ వచ్చిన పూరి జగన్నాథ్ మళ్ళీ పట్టు తప్పకూడదని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అందుకే ఈసారి ఫైటర్ విషయంలో స్క్రిప్ట్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు కూడా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలని భావిస్తున్నాడు పూరి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35qWoNG
Comments
Post a Comment