Skip to main content

అనిల్ రావిపూడి ఈ విషయంలో తగ్గుతాడా?

అనిల్ రావిపూడి ఈ విషయంలో తగ్గుతాడా?
అనిల్ రావిపూడి ఈ విషయంలో తగ్గుతాడా?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ప్రామిసింగ్ దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. 100 పెర్సంట్ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రం ముందు వరకూ కూడా మీడియం హీరోలతోనే పనిచేసాడు. తన మొదటి సినిమా పటాస్ ను కళ్యాణ్ రామ్ తో చేసిన అనిల్ రావిపూడి తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్, రవితేజ హీరోగా రాజా ది గ్రేట్, వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమాలను చేసాడు. ఈ నాలుగు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఎఫ్ 2తో అయితే అనిల్ పేరు మార్మోగిపోయింది. దీంతో మహేష్ పిలిచి మరీ అవకాశమిచ్చాడు. ఏదైనా కథ ఉంటే చెప్పమని అడగ్గా, సరిలేరు నీకెవ్వరు కథతో ఇంప్రెస్ చేసాడు అనిల్.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. డిసెంబర్ మొదటి వారానికి షూటింగ్ పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలవ్వగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు మళ్ళీ జోవియల్ గా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. దీంతో అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి తన సక్సెస్ ను ఈ సినిమాతో కూడా కంటిన్యూ చేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ చివరి దశల్లో ఉండడంతో అనిల్ రావిపూడి తర్వాతి సినిమా గురించి ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి.

ఇప్పటిదాకా మిడ్ రేంజ్ హీరోలతో చేసిన అనిల్ రావిపూడి, ఇప్పుడు టాప్ హీరోతో చేసాడు కాబట్టి ఇకనుండి టాప్ హీరోలతో చేయడానికే ఫిక్స్ అవుతాడని వార్తలు వచ్చాయి. అయితే టాప్ హీరోలు అంటే గట్టిగా అరడజను మంది ఉన్నారు. వీరికి డిమాండ్ ఎప్పుడూ భారీగానే ఉంటుంది. పైగా ఒక సినిమా కమిట్ అయ్యారంటే తొమ్మిది నెలలైనా మళ్ళీ ఫ్రీ అవ్వడానికి టైమ్ పడుతుంది. అంత కాలం వెయిట్ చేయాలంటే కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ విషయం అనిల్ రావిపూడికి బాగా తెలుసు.

కేవలం టాప్ హీరోలతోనే చేస్తానని కూర్చుంటే అది తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుందని, అయినా అలా మడి కట్టుకుని కూర్చోవడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. అందుకే సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ రావిపూడి ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రామ్ తో రాజా ది గ్రేట్ కే పనిచేయాలి. కానీ రామ్ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత రెడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు రామ్. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. సో వెంటనే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేయొచ్చు. ఎంతైనా అనిల్ ప్లానింగ్ సూపరంతే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DBn1Dv

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...