Skip to main content

అల్లుడి ప్రేమకథ నచ్చలేదంటున్న మామ

Glimpse of Naga Chaitanya from Venky Mama released
Glimpse of Naga Chaitanya from Venky Mama released

నిజ జీవితంలో మామ – అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య, తెరపై కూడా అవే పాత్రలు పోషిస్తూ చేసిన చిత్రం వెంకీ మామ. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చిత్ర వర్గాలు చెబుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఇప్పటిదాకా విడుదలైన ప్రోమోలు కూడా వీరి కెమిస్ట్రీని హైలైట్ చేస్తున్నాయి. తాజాగా నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిన్న టీజర్ లో మామ అల్లుడైన వెంకటేష్, నాగ చైతన్య సరదాగా సంభాషించుకోవడం మనం చూడొచ్చు. అల్లుడు నాగ చైతన్యను ఉద్దేశించి మామ వెంకటేష్, నీ ప్రేమను టైటానిక్ షిప్ అంత ఊహించుకున్నాను అల్లుడు కనీసం మన ఊర్లో పడవంత కూడా లేదు అనగానే నేను మత్తులో ఉండి ఏం చెప్పానో నువ్వు మందులో ఉండి ఏం విన్నావో అనుకుంటూ తన ప్రేమకథను చెప్పడం మొదలుపెడతాడు. కట్ చేస్తే మామ అల్లుళ్ళు ఇద్దరూ లుంగీ కట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంటారు.

సరదాసరదాగా సాగిపోయే ఈ సీన్ ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తుంది అనడంలో సందేహం లేదు. అంతే కాదు వెంకీ మామ అంటే కేవలం ఫన్ మాత్రమే ఉండదు, ఇందులో సీరియస్ సబ్జెక్ట్ ఉందని తెలుస్తోంది. టీజర్ లాస్ట్ లో నాగ చైతన్య మిలిటరీ గెటప్ లో ఉన్న షాట్స్ చూపిస్తాడు. అక్కడ ఆవేశంగా నాగ చైతన్య చెప్పే డైలాగ్ దాన్ని ఫాలోఅప్ చేస్తూ వచ్చే నేపధ్య సంగీతం రెండూ కూడా ఆకట్టుకుంటాయి. మొత్తానికి వెంకీ మామ నుండి నాగ చైతన్య ఫ్యాన్స్ కు వచ్చిన బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందని చెప్పాలి. ఇందులో రాశి ఖన్నా గ్లామరస్ షాట్స్ కూడా చూపించారు. ఇలా అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలు మా సినిమాలో ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేసారు. ఇందులో నాగ చైతన్య కెప్టెన్ కార్తీక్ గా కనిపిస్తాడని ఇదివరకే టీమ్ ప్రకటించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Dm30RD

Comments