Skip to main content

B.S.N.L లో వాలంటరీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 90 లక్షలా.?

Employees Of BSNL will Gets A Bang
Employees Of BSNL will Gets A Bang

అప్పుడెప్పుడో మా గురువుగారు రాంగోపాల్ వర్మ గారు చెప్పినట్లు “ఒకడి కామెడీ ఇంకొకడికి ట్రాజెడీ గా” అనిపిస్తుంది. మరొకటి ట్రాజెడీ ఒకరికి కామెడీగా అనిపిస్తుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ విషయంలో పైన చెప్పుకున్న డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఒక సంస్థగా బి.ఎస్.ఎన్.ఎల్ అందించిన సేవలు గురించి చెప్పాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు.

 మిగిలిన టెలికాం సంస్థలు అన్ని ఉద్యోగుల గొంతు మీద కూర్చుని పని చేయించుకుంటే,  బిఎస్ఎన్ఎల్ లో మాత్రం ఉద్యోగాలు చేసేవాళ్ళు “పని తక్కువ – పంచాయితీ ఎక్కువ” అన్నట్లు ఉండేవాళ్ళు. ఉదాహరణకి సిమ్ లు అమ్మడానికి మిగిలిన ప్రైవేటు టెలికాం సంస్థ యొక్క ఉద్యోగులందరూ టెంట్లు వేసుకుని, రోడ్డు మీద కూర్చొని, చెట్ల కింద కూర్చొని బాధలు పడుతుంటే,  బిఎస్ఎన్ఎల్ లో మాత్రం అమ్మే, ఒకటి రెండు సిమ్ కార్డులకు కూడా A.C ఆఫీస్.

ఫోను బిల్లు విషయంలో కూడా మిగిలిన టెలికాం సంస్థలు పోస్ట్ పెయిడ్ బిల్లును గట్టిగా మాట్లాడితే, ఇంటికి వచ్చి కస్టమర్ దగ్గర తీసుకొని వెళ్లే పరిస్థితులు ఉన్నప్పుడు;  బిఎస్ఎన్ఎల్ కి మాత్రం బిల్లు కట్టాలంటే వెళ్లి లైన్లో నుంచొని అదికూడా గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్  ప్రకారం జరిగేది.

బయట మిగిలిన టెలికాం సంస్థలు సేవలు, సౌకర్యాలు మరియు టెక్నాలజీ విషయంలో ముందుకు వెళుతూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం అదే పాతచింతకాయ పద్దతులు పట్టుకొని వేలాడుతోంది. ఎందుకంటే  ఒళ్ళు వంచి పనిచేయడానికి ప్రతి వాడికి బద్ధకం. ఒకటో తారీకు వచ్చినప్పుడల్లా జీతం వస్తుంది కదా అన్న ధీమా.

 బ్యాక్ గ్రౌండ్ లో ఎక్కడో  “నీ పాపం పండెను నేడు” అన్న పాట ఒకసారి కోరస్ గా వినపడుతూ ఉండగా, ఒక శుభ దినాన, ప్రతి నెలా, లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ పని మాత్రం చేయకుండా కాలక్షేపం చేసే వృద్ధ కపోతాలను  “మర్యాదగా మింగేయ్యండి” అని బిఎస్ఎన్ఎల్ చెప్పింది. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దయచేయండి అన్నట్లు.

 ఆ నిర్ణయం ఇప్పుడు కొంత మంది ఉద్యోగుల పాలిట వరంగా మారింది. ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం, పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కనుక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఉద్యోగి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కనీసం అతనికి మిగిలిన పది సంవత్సరాల జీవితం కింద దాదాపు 90 లక్షలు వచ్చే అవకాశం ఉంది.  మిగిలిన సెటిల్మెంట్ తాలుకు డబ్బులు మళ్లీ అదనంగా వస్తాయి. ఇన్ని లాభాలు ఇందులో ఉన్నాయి కనుక, బి.ఎస్.ఎన్.ఎల్ లో పనిచేసే 16 లక్షల మందిలో సుమారు 80వేల మంది ఒకేసారి వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు.

 బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం వి.ఆర్.ఎస్ తో పాటు, కంపెనీ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎలాగు వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇదే సందర్భంగా బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థని మళ్లీ లాభాల బాట పట్టిస్తానని మన కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు.

 భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pEW2DZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...