Skip to main content

జబర్దస్త్ ఎగ్జిట్ ను కూడా కమర్షియల్ చేస్తున్న నాగబాబు

జబర్దస్త్ ఎగ్జిట్ ను కూడా కమర్షియల్ చేస్తున్న నాగబాబు
జబర్దస్త్ ఎగ్జిట్ ను కూడా కమర్షియల్ చేస్తున్న నాగబాబు

గత నెల రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నాడు అంటూ రకరకాల కథనాలు మీడియాలో ప్రసారమవుతూ వచ్చిన విషయం తెల్సిందే. రకరకాలుగా ఈ పుకార్లు షికారు చేస్తుండడంతో స్వయంగా నాగబాబు తన ఛానల్ లో ఒక వీడియో పెట్టి జబర్దస్త్ నుండి తప్పుకుంటున్నట్లు ధృవీకరించాడు. అయితే తాను తప్పుకోవడానికి నిర్దిష్టమైన కారణాలు మాత్రం చెప్పలేదు. కేవలం సైద్ధాంతిక పరమైన కారణాలతో తాను జబర్దస్త్ నుండి ఎగ్జిట్ ఇస్తున్నట్లు చెప్పాడు నాగబాబు. వీడియో పది నిమిషాలకు పైగా ఉన్నా అందులో అసలు కారణాలు మాత్రం చెప్పలేదు. జబర్దస్త్ తన ఎదుగుదలకు ఎలా ఉపయోగపడిందీ, తాను జబర్దస్త్ కు ఎలా హెల్ప్ అయ్యిందీ వివరిస్తూ వచ్చాడు. జనాలు ఆసక్తిగా వీడియో మొత్తం జబర్దస్త్ ఎగ్జిట్ గురించి ఎదురుచూస్తుంటే నాగబాబు మాత్రం ఆ విషయం తేల్చకుండా ఓవర్ ది పిరియడ్ ఈ విషయం గురించి మాట్లాడతా అనేశాడు.

ఆ వీడియో వచ్చిన తర్వాత జీ తెలుగులో నాగబాబు పాల్గొంటున్న కొత్త షో లోకల్ గ్యాంగ్స్ కు సంబంధించిన మొదటి ప్రోమో వదిలారు. ఇది జబర్దస్త్ కు పోటీగా ప్రారంభమైన షో అన్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ నుండి నాగబాబు ఎగ్జిట్ తర్వాత చమ్మక్ చంద్ర అండ్ బ్యాచ్, కిరాక్ ఆర్పీ అండ్ బ్యాచ్ కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసారు. వీళ్ళను నాగబాబే తీసుకువచ్చాడు అన్న రూమర్స్ ఉన్నాయి. అయితే వీటిపై నాగబాబు పెదవి విప్పలేదు. జబర్దస్త్ గురించి మొదటి వీడియోలో నోరు మెదపని నాగబాబు రెండో వీడియోలో అయినా ఓపెన్ అవుతాడని ప్రేక్షకులు ఆశించారు. అయితే నాగబాబు రీసెంట్ గా రెండో వీడియోలో కూడా ఏమీ చెప్పకుండా ప్రేక్షకుల ఆశలను నీరుగార్చేసాడు. రెండో వీడియోలో నాగబాబు, అందులో తనకు ఎలా అవకాశం వచ్చిందీ, తన ప్రయాణం ఎలా మొదలైంది అన్నది చెప్పాడు. అలాగే జబర్దస్త్ ను మొదలుపెట్టినప్పుడు దీన్ని ఒక 25 ఎపిసోడ్స్ కు పరిమితం చేద్దామనుకున్నారని, అలాంటిది ఇన్నేళ్ళుగా రెండు జబర్దస్త్ లుగా సాగుతూ వచ్చిందని చెప్పుకొచ్చాడు. తనకు మొదట 25 ఎపిసోడ్స్ కే డీలింగ్ జరిగిందని అన్నాడు. మొదటి ఎపిసోడ్ నుండి ఎవరెవరు పార్టిసిపేట్ చేసిందీ, అందులో కంటెస్టెంట్స్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు అన్నదీ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఏ ఏ టీమ్ నుండి ఏ టీమ్ లీడర్ వచ్చాడు అంటూ పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

ప్రేక్షకులు తన నుండి ఆశిస్తున్న జబర్దస్త్ ఎగ్జిట్ గురించిన అసలు కారణాన్ని ఈ రెండో వీడియోలో కూడా చెప్పలేదు నాగబాబు. అయితే వీడియో ఆఖర్లో జబర్దస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్ ఎంట్రీ గురించి చెప్పాడు. నాగబాబు ఎగ్జిట్ కు వీళ్లకు సంబంధముందన్నది బలమైన న్యూస్. ఆ విషయంతో రెండో ముగించిన నాగబాబు తర్వాత వీడియోలో మిగతా వివరాలు చెబుతానని అన్నాడు. చూస్తుంటే జబర్దస్త్ నుండి తన ఎగ్జిట్ ను కూడా నాగబాబు కమర్సియలైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే కేవలం తన ఎగ్జిట్ అన్న ఒక్క కాన్సెప్ట్ ను తీసుకుని మూడు, నాలుగు ఎపిసోడ్లు ప్లాన్ చేసినట్టున్నాడు. ఒక్కో వీడియోకు 1 మిలియన్ పైనే వ్యూస్ వస్తున్నాయి మరి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34luGBZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...