టాలెంట్ ఉండాలే కానీ ఈరోజుల్లో రాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు అంటూ టాలెంట్ ఉన్న యువతకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎంతో మంది యువత రాణిస్తున్నారు కూడా. వీరిలో భార్గవ్ రెడ్డి అనే రైటర్ కం యాక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.
సీఏపిడిటి, హే పిల్లా అనే యూట్యూబ్ ఛానల్స్ కు సబ్స్క్రైబ్ అయిన ప్రేక్షకులకు భార్గవ్ సుపరిచితమే. సిఏపిడిటి అనేది మొదట ఒక ఫేస్ బుక్ పేజీగా మొదలైంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు. కంటెంట్ ను డిఫరెంట్ గా ప్రెజంట్ చేయడం వాళ్ళ స్పెషలిటీ. ముఖ్యంగా ప్రతి షార్ట్ ఫిలిమ్ క్లైమాక్స్ లోనూ వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ లు బాగా ఫేమస్ అయ్యాయి. అయినా వాళ్ళకి సబ్స్క్రైబర్లు అంత సులభంగా ఏం రాలేదు. క్వాలిటీ కంటెంట్ నే నమ్ముకుని ముందుకు సాగరు. వాళ్లే హే పిల్లా అని మరో యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టారు. ఇది మహిళలకు ప్రత్యేకంగా మొదలైన ఛానల్.
ఈ రెండు ఛానల్స్ ఫాలో అయ్యేవారికి భార్గవ్ సుపరిచితుడే. స్వతహాగా రైటర్ అయిన భార్గవ్ ఈ మధ్య లీడ్ రోల్ లో షార్ట్ ఫిలిమ్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. “when she is home alone”, “temporary boyfriend”, “proposing to my ex-girlfriend” వంటి షార్ట్ ఫిలిమ్స్ తో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు. అయితే యాక్టర్ కంటే ముందు భార్గవ్ లో ఒక మంచి రైటర్ కూడా ఉన్నాడు. హే పిల్లా ఛానల్ లో భార్గవ్ రచనలు చాలా ఫేమస్. భార్గవ్ రెడ్డి రచించిన “she & periods” ఏకంగా 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. దీంతో పాటు “when your boyfriend is a topper”, “Ammayi boothulu maatladite” వంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యాయి.
ప్రాసల కోసం ప్రయాస పడకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగులు రాయడం భార్గవ్ ప్రత్యేకత. భార్గవ్ రైట్స్ అనే పెన్ నేమ్ పై అతని రచనలు సాగుతుంటాయి. తను ఎంచుకునే కాన్సెప్ట్స్ కూడా ఎంతో కొంత వైవిధ్యంగా ఉండడంతో భార్గవ్ కు ఫేమ్ త్వరగానే వచ్చింది. సినిమాల్లోకి వెళ్లడమే తన లక్ష్యంగా ముందుకెళుతున్న భార్గవ్ త్వరలోనే తన కలను సాకారం చేసుకోవాలని కోరుకుందాం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2R3N4eH
Comments
Post a Comment