Skip to main content

ప్రభాస్ ను ఆకషికెత్తేసిన పూజ

ప్రభాస్ ను ఆకషికెత్తేసిన పూజ
ప్రభాస్ ను ఆకషికెత్తేసిన పూజ

పూజ హెగ్డే.. నార్త్ భామ అయినా కూడా తెలుగు చిత్రాలతో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ మొదట్లో వరసగా ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన పూజ, తర్వాత తెలుగు వారికి అందుబాటులోకి రాలేదు. దాదాపు ఏడాదిన్నర పాటు బాలీవుడ్ చిత్రం మోహ్ఎంజొదారో చేయడానికి ఫిక్స్ అయింది. ఆ చిత్రం చేసేటప్పుడు వేరే ఏ సినిమా చేయకూడదన్న నిబంధన ఉండడంతో మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో పూజ హెగ్డే కెరీర్ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయింది. అయితే మళ్ళీ తెలుగునే నమ్ముకున్న పూజ ఇక్కడ సక్సెస్ ను అందుకుంది. అల్లు అర్జున్ తో చేసిన డీజే ఆమె కెరీర్ ను మలుపుతిప్పింది. అంతకుముందు తెలుగులో పద్ధతైన పాత్రల్లోనే పూజ కనిపించింది. అయితే డీజేతో తనలోని గ్లామరసాన్ని పండించింది. దాంతో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో ఛాన్స్ వచ్చింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి చేసే అవకాశాన్నీ అందుకుంది. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్టే. దీంతో టాలీవుడ్ లో పూజ హెగ్డే పేరు మార్మోగిపోయింది.

ప్రస్తుతం మరోసారి అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న పూజ, త్వరలోనే ఈ షూటింగ్ ను ముగించుకోనుంది. మధ్యలో బాలీవుడ్ ను కూడా ఒకసారి పలకరించేసి అక్కడ హౌస్ ఫుల్ 4 చేసేసింది. దానివల్ల అమ్మడికి పెద్దగా ఒరిగిందేమి లేదు లెండి. ఇక పూజ హెగ్డే చేతిలో ఉన్నది ఒకే ఒక్క చిత్రం అదే రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన చేస్తున్న జాన్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూరోప్ నేపథ్యంలో సాగే ఒక అందమైన పీరియాడిక్ ప్రేమ కథగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తవ్వగా, సాహో ఇచ్చిన షాక్ తో అన్ని షెడ్యూల్స్ ను వాయిదా వేసేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగిమొదలుకానుంది.

అయితే పూజ హెగ్డే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతణ్ణి ఆకాశానికెత్తేసింది. ప్రభాస్ ఇప్పుడు ఎంత మాత్రం రీజినల్ స్టార్ కాదని, నేషనల్ స్టార్ రేంజ్ కూడా దాటిందని, ప్రభాస్ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పుకొచ్చింది పూజ. నేను యూఎస్ కు వెళ్ళినప్పుడు అక్కడి జనాలకు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నా అని చెప్పగానే మీరు ప్రభాస్ ల్యాండ్ నుండి వస్తున్నారా అని అడిగారు. ఈ రేంజ్ క్రేజ్ నేను ఎక్కడా చూడలేదు. బాహుబలి తర్వాత నార్త్ లో ప్రభాస్ అంటే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. సాహో కూడా నార్త్ జనాలు కథతో సంబంధం లేకుండా కేవలం ప్రభాస్ ను చూడడానికే వెళ్లారు. అలా బాలీవుడ్ లో కేవలం సల్మాన్ ఖాన్ సినిమాలకు మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఆ స్థాయి ప్రభాస్ కు వచ్చేసింది అంటోంది పూజ. ఇక జాన్ గురించి మాట్లాడుతూ ఇదొక అందమైన ప్రేమ కథ అని, వచ్చే ఏడాది విడుదలవుతుందని చెప్పుకొచ్చింది.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XMVoAW

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...