సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేషనల్ లెవెల్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. నార్త్ లో మహేష్ కు ఫ్యాన్స్ భీభత్సంగా ఉన్నారు. తన సినిమా ఏది విడుదలైనా నార్త్ జనాలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. నిజానికి మహేష్ కు ఉన్న అందానికి, తను చేసే సినిమాలకు బాలీవుడ్ కూడా పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అయితే మహేష్ ఏనాడూ టాలీవుడ్ ను విడిచి బయట సినిమాలు చేసింది లేదు. మహేష్ నటించిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం తమిళ్ లో డబ్ అయ్యాయి. అలాగే స్పైడర్ రెండు భాషల్లో విడుదలైంది. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే. దాని తర్వాత మహేష్ మళ్ళీ తెలుగు సినిమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించాడు. నార్త్ నుండి మహేష్ కు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా చేయలేనని సున్నితంగా తిరస్కరించాడు మహేష్.
చాలా ఇంటర్వ్యూలలో కూడా మహేష్ ను మీరు బాలీవుడ్ కు ఎప్పుడు వెళతారని ప్రశ్నించారు కూడా. అయితే మహేష్ దానికి కూడా చాలా సున్నితంగా తాను బాలీవుడ్ లో చేసే ఉద్దేశం లేదని, తనకి తెలుగులోనే బాగుందని, ఇక్కడినుండి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించవచ్చని చెబుతూ ఉంటాడు. హిందీలో సినిమా చేసే గ్యాప్ లో ఇక్కడ రెండు సినిమాలు పోతాయని, అంతకాలం ఇక్కడి ప్రేక్షకులకు దూరంగా ఉండలేనని చెబుతుంటాడు మహేష్. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయకపోయినా, మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ ఇసుమంతైనా తగ్గకపోవడం విశేషం. అలాగే సౌత్ లో మహేష్ ఎలాగు పాపులర్. ఆ విషయం తెల్సిందే.
అలాంటి మహేష్ తన నేషనల్ వైడ్ క్రేజ్ ను మరోసారి చూపించారు. సినిమాలకు రేటింగులు ఇచ్చే ప్రముఖ సంస్థ ఐఎండిబి పెట్టిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ లో సరిలేరు నీకెవ్వరు టాప్ లో ట్రెండ్ అవ్వడం ప్రాధాన్యత.సంతరించుకుంది. ఈ ఏడాది వేసవిలో మహర్షి విడుదలవుతున్నప్పుడు కూడా ఐఎండిబిలో ఆ సినిమా టాప్ లో ట్రెండ్ అయింది. కొన్ని రోజుల పాటు టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈసారి సరిలేరు నీకెవ్వరు టీజర్ వచ్చిన రెండు, మూడు రోజుల పాటు టాప్ లోనే ఉంది ఈ సినిమా. ఏకంగా 43 శాతం మంది ఈ చిత్రం చూడటానికే ఎదురుచూస్తున్నామని ఓటు వేయడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పోలింగ్ లో రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 ఉండగా దానికి 16 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏదేమైనా ఒక నేషనల్ వైడ్ ప్లాట్ ఫామ్ లో టాప్ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు ట్రెండ్ అవ్వడాన్ని బట్టి మహేష్ కు దేశవ్యాప్తంగా ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందనేది అర్ధమవుతూనే ఉంది. అందుకే మహేష్ కు సంబంధించిన ఏ ట్యాగ్ అయినా ట్విట్టర్ లో నేషన్ వైడ్ ట్రేండింగ్ అవుతుంది. సూపర్ స్టారా మజాకా!
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rsZVw2
Comments
Post a Comment