Skip to main content

ఆ మాత్రం దానికి బన్నీ, మహేష్ అంత హడావిడి ఎందుకు అంటున్నారు

Allu Arjun and Mahesh Babu clash for Sankranthi
Allu Arjun and Mahesh Babu clash for Sankranthi

తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి సీజన్ అత్యంత ముఖ్యమైనది. అందుకే సంక్రాంతి సీజన్ లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే బాగా డిమాండ్ ఉన్న సీజన్ కావడంతో కనీసం నాలుగు నెలల ముందైనా స్లాట్ బుక్ చేసుకోకుంటే సినిమాను విడుదల చేయడం అసాధ్యం. అందుకే మాములుగా సినిమా విడుదల తేదీ నెల రోజుల ముందు కూడా చెప్పని నిర్మాతలు, సంక్రాంతికి మాత్రం నాలుగు నెలల ముందైనా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేసి తమ స్లాట్ బుక్ చేసేసుకుంటారు. విడుదల తేదీ చెప్పకపోయినా కనీసం సంక్రాంతి విడుదల అంటూ ముందుకు తోసుకుంటూ వస్తారు. వచ్చే  సంక్రాంతికి కూడా ఇదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రాలు రెండూ కూడా మొదటినుండీ సంక్రాంతికి విడుదల అని ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెల్సిందే. అయితే సడెన్ గా ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్లుండి జనవరి 12న అల వైకుంఠపురములో విడుదలవుతుందని అల్లు అర్జున్, నిర్మాతలు ప్రకటించారు. ఆ ప్రకటనవచ్చిన గంటన్నరలో తమ సినిమా జనవరి 12న విడుదలవుతుందని మహేష్ బాబు అండ్ కో కూడా ప్రకటన జారీ చేసారు.

దీంతో రెండు స్టార్ హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదలవుతున్నాయంటూ రెండు, మూడు రోజులు ఎక్కడ చూసినా అదే డిస్కషన్. ఇంకా చాలా రోజులు ఉన్నా కానీ ట్రేడ్ ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసింది. బయ్యర్లు కూడా ఇలా రెండూ ఒకేరోజు వస్తే థియేటర్లు సర్దుబాటు చేసుకునేది ఎలా అంటూ వాపోయారు. నాలుగు రోజులు గడిచాక విడుదల తేదీలో మార్పు వస్తుందని, ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారు అనుకుంటూ వచ్చారు. కానీ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇద్దరూ జనవరి 12నే తమ సినిమా విడుదలవుతుందని ఎవరికి వారే పట్టుబట్టి మరీ ప్రకటన చేసుకుంటూ వచ్చారు. మొన్నటిదాకా కూడా ఇద్దరూ జనవరి 12నే కలవరించారు. అయితే నిర్మాతల గిల్డ్ ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఇప్పటికి కూడా కలగజేసుకోకపోతే వ్యవహారం మరింత జఠిలమవుతుందని భావించింది. ఇరు నిర్మాతల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించి ఒక సినిమాను వెనక్కి తగ్గేలా చేసింది.

మొత్తానికి సమస్య పరిష్కారమైంది. జనవరి 11న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదలవ్వనుంది. అల వైకుంఠపురములో ముందు నుండీ చెబుతున్నట్లు జనవరి 12నే. వస్తోంది. దీంతో సంక్రాంతి సినిమాల సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. ఇప్పుడు ఈ వార్త విన్న ప్రేక్షకులు ఈ మాట్లాడుకునేదేదో ముందే మాట్లాడుకుని ఉంటే పరిస్థితి ఇంతే దూరం వచ్చేది కాదుగా. ఈ మాత్రం దానికా అంత హడావిడి అంటూ పంచ్ లు వేస్తున్నారు. నిజమే మరి అప్పుడు అంత పంతానికి పోవడం దేనికో, ఇప్పుడు సర్దుబాటు చేసుకోవడం ఎందుకో. అందరినీ కొన్నాళ్ళు టెన్షన్ పెట్టడానికి కాకపొత. ఈ రెండు చిత్రాలపై దాదాపు 250 కోట్ల బిజినెస్ ఆధారపడి ఉంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33jhP1H

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...