Skip to main content

సరిలేరు టీజర్ లో ఆవిడ కనిపించలేదేం?

సరిలేరు టీజర్ లో ఆవిడ కనిపించలేదేం?
సరిలేరు టీజర్ లో ఆవిడ కనిపించలేదేం?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న సరిలేరు నీకెవ్వరు టీజర్ భారీ అంచనాల మధ్య మొత్తానికి నిన్న సాయంత్రం చెప్పిన టైమ్ కే విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట ఇచ్చినట్లుగానే సరిలేరు నీకెవ్వరు ఫుల్ మాస్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది. మహేష్ బాబు చాలా సినిమాల తర్వాత ఇంత యాక్టివ్ గా కనిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీజర్ ను పదే పదే చూస్తూ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ టీజర్ ను గమనిస్తే మహేష్ బాబుతో పాటు ఇందులో కీలక పాత్రలు పోషించిన విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ పాత్రల పరిచయం కూడా జరిగింది. ప్రకాష్ రాజ్, విజయశాంతి పాత్రల డైలాగులు కూడా ఈ టీజర్ లో ఉంచారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ టీజర్ లాస్ట్ లో చెప్పే “ప్రతి సంక్రాంతికి అల్లుడ్లు వస్తారు ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అన్న డైలాగ్ హిలేరియస్ గా ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు అని మహేష్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. మాకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇదని మాట్లాడుకుంటున్నారు. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాలో హీరోయిన్ అయిన రష్మిక లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డైలాగ్ సంగతి పక్కనపెడితే కనీసం ఒక్క ఫ్రేమ్ లో కూడా ఆమెను ఎందుకు చూపించలేదో అర్ధం కాదు. అంటే రష్మీక పాత్ర ఇందులో నామమాత్రమే అని చెప్పకనే చెబుతున్నారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరో వాదన కూడా మొదలైంది. ఇందులో రష్మిక పాత్రకు స్పెషలిటీ ఉందిట. అందుకే ఆమె షాట్ ను ఇందులో పెట్టలేదని, కుదిరితే ఆమెపై స్పెషల్ టీజర్ ను కట్ చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు.

మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను మొదట జనవరి 12న విడుదల చేయాలనుకున్నా, తెలుగు నిర్మాతల గిల్డ్ కలగజేసుకోవడంతో అల వైకుంఠపురములో చిత్రంతో క్లాష్ రాకూడదని జనవరి 11 కి మార్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో మహేష్ ఒక ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేస్తున్నాడు.

మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QHoq3d

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...