Skip to main content

వరసపెట్టి సినిమాలను వదులుతున్న వర్మ

వరసపెట్టి సినిమాలను వదులుతున్న వర్మ
వరసపెట్టి సినిమాలను వదులుతున్న వర్మ

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెబితే 90ల్లో ప్రేక్షకులు ఊగిపోయేవారేమో కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వర్మ దర్శకుడిగా తన స్థాయిని కోల్పోయి చాలా కాలమే అయింది. ఏ దర్శకుడైనా కాలం గడిచే కొద్దీ తన పట్టుని కోల్పోతుంటాడు. తన సత్తా తగ్గి, అవుట్ డేట్ అయిపోయి క్వాలిటీ తక్కువ సినిమాలు రావడం సహజమే. ఎంతో మంది లెజండరీ దర్శకులు ఇందుకు మినహాయింపేమి కాదు, విశ్వనాధ్, రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు ఇలా ఎంతో మంది దర్శకులు కెరీర్ చరమాంకంలో అవుట్ డేట్ సినిమాలను అందించారు. అయితే రామ్ గోపాల్ వర్మ పతనం వీటికి అతీతం. చాలా తక్కువ కాలంలోనే సినిమాపై, మేకింగ్ పై పట్టుని కోల్పోయాడు వర్మ. వరసపెట్టి నాసిరకం సినిమాలను వదులుతూ ప్రేక్షకుల్లో కూడా ఒకలాంటి విరక్తి భావాన్ని కలిగించేసాడు. బయోపిక్ లు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ పుణ్యమాని ఇంకా వర్మకి టాలీవుడ్ లో నూకలు మిగిలాయి. అయినా ఇది వరకు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు వర్మ సెన్సేషన్ కోసం పాకులాడాల్సి వస్తోంది. వర్మ ఏం చేసినా దాని వెనుక అటెన్షన్ సీకింగ్ ఉంటోంది. దర్శకుడిగానే కాకుండా ఇటీవలే కాలంలో మనిషిగా కూడా తన స్థాయిని బాగా తగ్గించేసుకున్నాడు వర్మ. అనవసర విషయాల్లోకి వెళ్లి, అవసరం లేని దానికన్నా ఎక్కువ సాగదీసి రామ్ గోపాల్ వర్మ అందరికీ దూరమయ్యాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా అతనికి ఏమైనా మతి కంట్రోల్ లో లేదేమో అన్న తరహాలో వ్యాఖ్యలు చేసాడంటే వర్మ ఏ స్థాయికి దిగజారిపోయాడు అన్నది అర్ధమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ, గత కొన్నేళ్ల నుండి ఎన్నో సినిమాలను ప్రకటించాడు, అందులో కొన్ని మాత్రమే తీసాడు, వాటిలో సగం మాత్రమే విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని కొనడానికి బయ్యర్లు ముందుకురాక ఇంకా ల్యాబ్ లలో మగ్గుతూనే ఉన్నాయ. అయితే ఇప్పుడు తనకి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా వల్ల కొంచెం బజ్ ఉంది కాబట్టి తన పాత సినిమాలను వరసపెట్టి వదలాలని నిర్ణయించుకున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వివాదాస్పద అంశాలతో రూపొందిన సినిమా. అది నవంబర్ 29న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా వచ్చిన వారం రోజులకు డిసెంబర్ 6న వర్మ నిర్మాణంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ అనే సినిమాను వదులుతున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటిది కాదు. మూడేళ్ళ క్రితం పూర్తైన సినిమా. నైనా గంగూలీ కథానాయిక. రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ అప్పట్లో భారీ హడావిడి చేసిన చిత్రమిదే. ఇప్పుడు ఈ తరహాలో విడుదల చేస్తున్నాడు. దాంతో పాటు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అంటూ మరో సినిమాను వదులుతున్నాడు. ఇది కూడా పాతదే, అప్పట్లో బ్రూస్ లీ కు ట్రిబ్యూట్ అంటూ కేవలం టీజర్ మాత్రమే విడుదల చేసి ఆపేసాడు. ఇప్పుడు అదే సినిమాను కొత్త హంగులతో దించాలను అనుకుంటున్నాడు వర్మ. చూద్దాం మరి వర్మ పాచికలు పారతాయేమో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37EuY8U

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...