Skip to main content

తేజుతో ఈ మెగా ప్రొడ్యూసర్ మరొకటి

తేజుతో ఈ మెగా ప్రొడ్యూసర్ మరొకటి
తేజుతో ఈ మెగా ప్రొడ్యూసర్ మరొకటి

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మెగా నిర్మాత అల్లు అరవింద్ అండగా నిలుస్తూనే ఉన్నాడు. నిర్మాతగా అల్లు అరవింద్ స్థాయి గురించి చెప్పాల్సిన పనిలేదు. తన జడ్జిమెంట్ ఆన్ ది స్పాట్ ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిట్లే ఎక్కువ ఉంటాయి. ఆ సంస్థ నుండి ప్లాప్ చిత్రాలు రావొచ్చేమో కానీ బ్యాడ్ సినిమాలు మాత్రం అరుదుగా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్ కు అండగా ఉంటుండడం నిజంగా అభినందించతగ్గ విషయమే. తేజు తన మొదటి చిత్రంగా రేయ్ సినిమాను చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ సినిమా విడుదలకు కష్టాలు పడడంతో తొలి చిత్రంతోనే తేజు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వెంటనే అల్లు అరవింద్ రంగంలోకి దిగి దిల్ రాజు సహకారంతో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందించాడు అల్లు అరవింద్. రేయ్ కంటే ముందే పిల్లా నువ్వు లేని జీవితం సినిమా విడుదలై తేజుకి ప్రేక్షకుల్లో గుర్తింపు తీసుకొచ్చింది.

దాని తర్వాత విడుదలైన రేయ్ ప్లాప్ అయినా ఆ ప్రభావం తేజ్ కెరీర్ పై పడలేదు. రేయ్ తర్వాత తేజ్ కు వరసగా రెండు, మూడు హిట్లు వచ్చాయి. ప్రామిసింగ్ స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తేజ్ కెరీర్ మళ్ళీ పట్టాలు తప్పింది. కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా తేజ్ వరసగా అరడజను ప్లాపులను చవి చూడాల్సి వచ్చింది. దాని తర్వాత వచ్చిన చిత్రలహరి డీసెంట్ సినిమా అనిపించుకున్నా కెరీర్ పూర్తిగా గాడిలో పడాలంటే సాయి తేజ్ కు బంపర్ హిట్ అత్యవసరం. అందుకే మళ్ళీ అల్లు అరవింద్ తన సహాయసహకారాలు అందించాడు. తనకు ఎంతో నమ్మకమున్న మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే సినిమాను సెట్ చేసాడు.

ఇప్పుడు ఆ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రతిరోజూ పండగే ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. కచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయి. డిసెంబర్ 20న ఈ సినిమా భవితవ్యం తేలిపోతుంది. రీసెంట్ గా ఈ సినిమా లాస్ట్ సాంగ్ చిత్రీకరణ పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ తేజ్ తో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు అల్లు అరవింద్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పాడు అల్లు అరవింద్. తేజ్ తో ఎప్పటినుండో ఒక సినిమా చేయాలని అనుకుంటే అది ప్రతిరోజూ పండగేతో కుదిరిందని, ఇప్పుడు అది కాకుండా మరో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్లు చెప్తున్నాడు. ప్రతిరోజూ పండగే పూర్తైన వెంటనే సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. ఇప్పటికే చిన్న షెడ్యూల్ కూడా ఒకటి పూర్తయింది. సోలో బ్రతుకే సో బెటర్ పూర్తైన వెంటనే అల్లు అరవింద్ ప్రొడక్షన్ లో తేజ్ సినిమా మొదలవుతుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DvNRx1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...