Skip to main content

జక్కన్న సక్సెస్ ఫార్ములా గుట్టు విప్పేసిన అనిల్ రావిపూడి

జక్కన్న సక్సెస్ ఫార్ములా గుట్టు విప్పేసిన అనిల్ రావిపూడి
జక్కన్న సక్సెస్ ఫార్ములా గుట్టు విప్పేసిన అనిల్ రావిపూడి

ఈరోజు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. తన మొదటి సినిమా నుండి ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఎఫ్ 2 వరకూ అన్నీ హిట్లే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 ఇలా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఐదో సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశాన్ని సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన ఐదో ప్రయత్నాన్ని తెరమీదకు సంక్రాంతికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగేలా చేసుకోగలిగాడు. నిన్ననే సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలవ్వగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల పూర్తి ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్లూ అతి మంచి వాడి పాత్రలు, సటిల్ యాక్టింగ్ తోనే సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ ఈ టీజర్ లో చాలా యాక్టివ్ గా కనిపించడంతో కచ్చితంగా సినిమా అదిరిపోతుందని నమ్మకంతో ఉన్నారు.

ఇక అనిల్ రావిపూడి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శక ధీరుడు రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటో వివరించాడు. రాజమౌళి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ విజయవంతమైనవే. బాహుబలి 1 అండ్ 2 అయితే దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అంతటా రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం తెలుగులో టాప్ స్టార్స్ అయిన రాం చరణ్, ఎన్టీఆర్ లతో పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా అయిన ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న రాజమౌళి సక్సెస్ సీక్రెట్ గురించి వివరించాడు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా, అది ఎంత బడ్జెట్ తో తెరకెక్కినా తన సినిమాల్లో కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. మనమెప్పుడూ మన బలాన్ని విడిచి ఏదీ ప్రయత్నించకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా మన బలాన్ని మనం నమ్ముకోవాలి. ఇక రాజమౌళి విషయానికొస్తే అతని బలం ఎమోషన్. ఎంత భారీ బడ్జెట్ సినిమా యినా, అందులో ఎంత గ్రాఫిక్స్ వాడినా కూడా రాజమౌళి ఎమోషన్ ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈగ, బాహుబలి వంటి సినిమాలు చేసినప్పుడు కూడా ప్రేక్షకులను ఎక్కువ కదిలించింది కూడా ఎమోషనే. అందుకే రాజమౌళి సినిమాలు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు తక్కువ అని పేర్కొన్నాడు.

నిజమే కదా. రాజమౌళి స్ట్రాటజీని అనిల్ రావిపూడి బాగా అనలైజ్ చేసాడని చెప్పవచ్చు. అన్నట్లు అనిల్ రావిపూడి కూడా సక్సెస్ఫుల్ దర్శకుడే. నాలుగు సినిమాలే చేసినా కూడా అవన్నీ మంచి విజయలే సాధించాయి. మరి అనిల్ రావిపూడి బలం ఏంటని తనకు తాను అనలైజ్ చేసుకున్నాడో లేదో కానీ అతని సినిమాలు చూసిన ఎవరికైనా ఈజీగా అర్ధమయ్యే విషయం కామెడీయే అనిల్ రావిపూడి ప్రధాన బలం. అన్ని సినిమాల్లోనూ కామెడీ హైలైట్ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు లో కూడా కామెడీ అదిరిపోతుందని అంటున్నారు. మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి అనిల్ రావిపూడి రికార్డును పదిలంగా ఉంచుతుందా లేదా అన్నది చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OBBPaC

Comments