Skip to main content

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు
మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్ విషయంలో మొదటినుండి కంప్లైంట్స్ ఉండేవి. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతుండడం, విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. దీంతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ విషయంలో కంగారు పడకండి, ఇంకా సంక్రాంతికి కదా రిలీజ్ అంటూ సెటైరికల్ వీడియో కూడా పోస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఒక్కసారి టీజర్ విడుదలయ్యాక పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేసిన టీజర్ వారికి ఫీస్ట్ లా అనిపించింది. అందుకే ఈ టీజర్ దాదాపు 120 గంటలకు పైగా టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అయింది. 25 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చిన ఈ టీజర్ కు 5 లక్షల లైకులు కూడా రావడం విశేషం. టీజర్ కు వచ్చిన బజ్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది.

రీసెంట్ గా మాస్ ఎంబీ మండేస్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి, ఏమిటో గెస్ చేయండి అంటూ ఫ్యాన్స్ ను ఊరించిన సంగతి తెల్సిందే. హ్యాష్ ట్యాగ్ ను బట్టి చూస్తే ప్రతి సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ వస్తుందని అర్ధమైపోతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం సరిలేరు నీకెవ్వరు టీమ్, ఆ హ్యాష్ ట్యాగ్ కు అర్ధమేంటో చెప్పేసారు. డిసెంబర్ నెలలో 5 సోమవారాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ 5 సోమవారాలు, ఒక్కో సోమవారం, సరిలేరు నీకెవ్వరు నుండి ఒక్కో పాట విడుదలవుతుంది. దీన్ని బట్టి సినిమాలో 5 పాటలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. దాంతో పాటు మొదటి పాట డిసెంబర్ 2న రాబోతోందని కూడా అప్డేట్ ఇచ్చినట్లయింది. దీంతో ఇక డిసెంబర్ మొదలుకావడమేంటి, సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లతో హోరెత్తిస్తుంది అన్నమాట.

డిసెంబర్ అంతా పాటలను వదులుతున్న తరుణంలో థియేట్రికల్ ట్రైలర్ జనవరిలోనే వస్తుందని అర్ధమైపోతుంది. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయమని ఆర్డర్ కూడా వేసాడు. ఏదైనా ఓపెన్ గ్రౌండ్ ను చూడమని చెప్పాడు. ఈ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మహేష్.

సరిలేరు నీకెవ్వరులో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఈ చిత్రం ద్వారానే రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అజయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడు. అనిల్ రావిపూడి దర్శకుడు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Oyj2OJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...