Skip to main content

సరిలేరు నీకెవ్వరు టీజర్ లో ఆ రెండు డైలాగులు ఎవరికి పంచ్?

సరిలేరు నీకెవ్వరు టీజర్ లో ఆ రెండు డైలాగులు ఎవరికి పంచ్?
సరిలేరు నీకెవ్వరు టీజర్ లో ఆ రెండు డైలాగులు ఎవరికి పంచ్?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. ఇన్నాళ్లూ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని ఫ్యాన్స్ ఆందోళన చెందారు కానీ ఒక్క టీజర్ తో ఈ సినిమాపై ఎక్కడలేని బజ్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ టీజర్ కట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరో సినిమా టీజర్ అంటే ఏదో మొక్కుబడి వ్యవహారంలా కాకుండా అందులో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు పొందుపరిచి సినిమాపై ఆసక్తి కలిగేలా చేయడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దాంతో ఈ టీజర్ ను సోషల్ మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తున్నారు. టీజర్ విడుదలైన 12 గంటల్లోనే ఈ చిత్రం 10 మిలియన్ వ్యూస్ ను, 12 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సాధించడం విశేషం. తెలుగు సినిమా టీజర్లలో వేగంగా ఈ మార్క్ కు చేరుకున్న చిత్ర టీజర్ గా పేర్కొంటున్నారు. టీజర్ పై సూపర్ రెస్పాన్స్ రావడంతో సరిలేరు నీకెవ్వరు యూనిట్ కూడా చాలా ఉత్సాహంగా సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నెలాఖరుకి సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇటీవలే కేరళ వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడ ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చింది. ఇంకా ఈ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందని సమాచారం. వెంకీ సినిమా రేంజ్ లో ఈ చిత్రంలో కూడా ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుంది అంటున్నారు. కామెడీ ప్రధానంగా సాగినా కూడా ఫ్యాన్స్ కు కనువిందు చేసే అంశాలైన ఫైట్స్, ఎమోషన్స్ ను మిస్ చేయకుండా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు టీజర్ గురించి ప్రస్తుతం డిస్కషన్స్ ఎక్కువ అవుతుండగా, ప్రధానంగా ఈ సినిమాలో రెండు డైలాగ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. “భయపడేవాడే బేరం గురించి మాట్లాడతాడు.. మన దగ్గర బేరాలేవమ్మా” అని మహేష్ చెప్పే డైలాగ్ ను సంక్రాంతి పోటీకి అన్వయించుకుంటున్నారు. జనవరి 12నే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలను ప్రకటించి రిలీజ్ డేట్ మార్చడానికి రెండూ కూడా ససేమీరా అన్న విషయం తెల్సిందే. ఆఖరికి నిర్మాతల గిల్డ్ కలగజేసుకుని ఇద్దరు నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చి సరిలేరు చిత్రాన్ని ఒక రోజు ముందుకు జరిపేలా డీల్ చేసారు. దానికి పంచ్ గానే ఈ డైలాగ్ కావాలని టీజర్ లో పెట్టినట్లు అంటున్నారు.

ఇక టీజర్ ఆఖర్లో “ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు” అని ప్రకాష్ రాజ్ అంటాడు. ఇది సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలను ఉద్దేశించి మహేష్ వేసిన కౌంటర్ అని అంటున్నారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా అసలైన మొగుడు సరిలేరు నీకెవ్వరు అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.అందుకే కావాలనే ఈ రెండు డైలాగ్స్ ను టీజర్ లో పెట్టినట్లు ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QJ9JN7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...